Farah Khan Tests COVID-19 Positive : బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కరోనా బారిన పడింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తనకు పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించింది. 'రెండు సార్లు టీకా వేయించుకున్నా. అలాగే డబుల్ డోస్ టీకా తీసుకున్న జనాలతో పని చేస్తున్న నాకు కరోనా సోకుతుందని అస్సలు ఊహించలేదు. దాదాపు నాతో సన్నిహితంగా మెలిగిన అందరికీ వెంటనే కోవిడ్ టెస్ట్ చేసుకోమని చెప్పాను. ఒకవేళ పొరపాటున ఎవరికైనా చెప్పడం మర్చిపోయుంటే దయచేసి పరీక్ష చేయించుకోండి. వీలైనంత త్వరగా ఈ వైరస్‌ను జయిస్తానని ఆశిస్తున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.
కాగా ఫరా ఖాన్ ప్రస్తుతం జీ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇప్పుడామెకు కరోనా అని తేలడంతో ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు సింగర్ మైకా సింగ్‌ను షోకు రప్పించనున్నారని సమాచారం. ఈ మధ్యే ఆమె సూపర్ డ్యాన్సర్ 4 షోలో గెస్ట్‌గా అలరించగా, కౌన్ బనేగా కరోడ్ పతి 13వ సీజన్‌లో ఆమె మీద ఒక ఎపిసోడ్ కూడా చిత్రీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment