ఫరా ఖాన్కు షారుక్ ఖాన్ ఖరీదైన కానుక | Shah Rukh Khan gifts brand new car to Farah Khan | Sakshi
Sakshi News home page

ఫరా ఖాన్కు షారుక్ ఖాన్ ఖరీదైన కానుక

Published Tue, Apr 15 2014 1:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Shah Rukh Khan gifts brand new car to Farah Khan

ముంబై: స్నేహితులను ఎలా సంతోషపెట్టాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు బాగా తెలుసు. ఖరీదైన కానుకలతో వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాడు. షారుక్ తన సన్నిహితురాలు, డైరక్టర్ ఫరా ఖాన్కు ఖరీదైన ఓ కొత్త బ్రాండ్ కారును కానుకగా ఇచ్చాడు. షారుక్ చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్'కు ఫరా దర్శకత్వం వహించింది. బహుమతిని అందుకున్న ఫరా సంతోషంతో షారుక్కు కృతజ్ఞతలు తెలియజేసింది. 'నేనందుకున్న బహుమతి ఏమిటో చూడండి! షారుక్కు ధన్యవాదాలు' అంటూ ఫరా ట్వీట్ చేసింది. కారుతో దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. షారుక్, ఫరా చాలా కాలంగా మంచి స్నేహితులు. ఫరాకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2004లో షారుక్ నటించిన'మై హూ నా', 2007లో 'ఓం శాంతి ఓం' చిత్రాలు విడుదలైన తర్వాత ఫరాకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చాడు.  తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో 'హ్యాపీ న్యూ ఇయర్'చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్ తదితరులు తారాగణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement