
కాన్స్‌లో కేక!
కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఐశ్వర్యారాయ్, సోనమ్‌కపూర్, మల్లికా శెరావత్ హొయలు చూసి, అక్కడివారు ఫిదా అయిపోయారు.
కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఐశ్వర్యారాయ్, సోనమ్‌కపూర్, మల్లికా శెరావత్ హొయలు చూసి, అక్కడివారు ఫిదా అయిపోయారు. ఇప్పుడు మరో ఇండియన్ బ్యూటీ అవికా గోర్ కూడా జత కలిశారు. హిందీ బుల్లితెర నటుడు మనీష్‌తో కలిసి అవిక నటించిన లఘు చిత్రం ‘ఆంఖే బాతే’ షార్ట్ ఫిలిం విభాగంలో కాన్స్‌లో ప్రదర్శితమైంది. దీనికోసమే అవిక కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో నటించడంతో పాటు క్రియేటివ్ డెరైక్టర్‌గానూ వ్యవహరించారామె.
ఇక.. అవిక రెడ్ కార్పెట్ ప్రెజెన్స్ విషయానికి వస్తే.. ముదురు నీలం రంగు గౌనులో మెరిశారు. కురచగా కత్తిరించుకున్న జుత్తు ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. ఎర్ర తివాచీపై వయ్యారంగా వాక్ చేసి, కేక పుట్టించారీ బ్యూటీ.