ఐష్‌ను ఇలా చూశాక.. | story behind Aishwarya Rai’s Cannes dress | Sakshi
Sakshi News home page

ఐష్‌ను ఇలా చూశాక..

Published Sun, May 21 2017 2:07 PM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

story behind Aishwarya Rai’s Cannes dress


కేన్స్‌:
నలభైమూడేళ్ల వయసులోనూ వన్నెతరగని అందంతో వెలిగిపోతున్న ఐశ్వర్యరాయ్‌ ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సిండ్రెల్లా లుక్‌తో అభిమానుల మతిపోగొట్టింది. ఈ సిండ్రెల్లా డ్రెస్‌ వేసుకుని అడుగుతీసి అడుగు వేయాలంటే కనీసం ఐదుగురి సాయం అవసరం. అలా ఐష్‌ హొయలొలుకుతూ ఫోజులిచ్చిన ఫొటోలు ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్నాయి. దుబాయ్‌కి చెందిన ప్రముఖ డిజైనర్‌ మైఖేల్‌ సింకో ఈ సిండ్రిల్లా డ్రెస్‌ను రూపొందించారు.

‘ప్రపంచంలోని గొప్ప అందెగత్తెల్లో ఐశ్వర్య ముందు వరుసలో ఉంటుంది. నేను డిజైన్‌ ఫిట్‌లో ఆ అందాలరాశి నడిచిరావడం చూసి నా జన్మధన్యమైంది’ అని ఉప్పొంగిపోయారు డిజైనర్‌ సిన్కో. నిజానికి ఈ డిజైన్‌.. ప్రాన్స్‌ రాజు సన్‌ లూయిస్‌-4 సతీమణి మారియా ధరించిన దుస్తుల నుంచి ప్రేరణపొంది రూపొందించానని ఆమె పేర్కొన్నారు.


సిండ్రెల్లా.. ఈ పేరెలా?
బాలీవుడ్‌ తారలు ఐశ్వర్యరాయ్‌తోపాటు దీపికా పడుకొన్‌, సోనమ్‌ కపూర్‌లు.. ప్రఖ్యాత ఫ్రెంచ్‌ కాస్మోటిక్‌ కంపెనీ ‘లోరియల్‌‌’కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. సిన్కో డిజైన్‌చేసిన దుస్తుల్లో ఐష్‌ కనిపించిన తీరును ప్రస్తావిస్తూ లోరియల్‌ తన అఫీషియల​ పేజీలో ‘హలో సిండ్రెల్లా.. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో చాలా అందంగా కనిపిస్తున్నావ్‌..’అని పోస్ట్‌చేసింది. అలా ఈ డిజైన్‌కు పెట్టకుండానే సిండ్రెల్లా పేరు ఫిక్సైపోయింది.










Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement