కాన్స్‌ ఉత్సవాల్లో క్వీన్‌ | Kangana Ranaut to Debut at the 71st Cannes Film Festival Red Carpet | Sakshi
Sakshi News home page

కాన్స్‌ ఉత్సవాల్లో క్వీన్‌

Published Thu, Apr 26 2018 1:38 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Kangana Ranaut to Debut at the 71st Cannes Film Festival Red Carpet - Sakshi

కంగనా రనౌత్‌

ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్, విద్యాబాలన్, సోనమ్‌ కపూర్, మల్లికా షెరావత్‌.. వంటి స్టార్‌ హీరోయిన్స్‌ కాన్స్‌ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. అయితే.. బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ ఇప్పటి వరకూ కాన్స్‌ ఉత్సవాల్లో పాల్గొనలేదు. తొలిసారి ఆమెకు ఈ ఉత్సవాల్లో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చింది. ప్రతి సంవత్సరం  కాన్స్‌లో అంతర్జాతీయ సినిమా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలో వివిధ దేశాల నుంచి పలువురు నటీనటులు పాల్గొని సందడి చేస్తుంటారు.

ఇండియా తరఫున పైన పేర్కొన్న పలువురు బాలీవుడ్‌ కథానాయికలు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఏడాది మేలో జరగనున్న కాన్స్‌ ఉత్సవాల్లో రెడ్‌ కార్పెట్‌పై తళుకుబెళుకులు చూపించే అరుదైన అవకాశం కంగనాని వరించింది. 2018 కాన్స్‌ ఉత్సవాల్లో పాల్గొనాలంటూ ఆమెకు ఆహ్వానం అందింది. ఇండియన్‌ సినిమా బ్రాండ్‌ అంబాసిడర్‌గా, ఓ బ్రాండ్‌ ప్రమోటర్‌గా కంగన ఈ ఉత్సవాలకు హాజరు కానున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో ఆమె నటించిన తాజా చిత్రం ‘మణికర్ణిక’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement