‘మోస్ట్ డిజైరబుల్ వ్యక్తిగా ఎన్నికయినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ నా చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడిని...అమ్మాయిలేవరు నన్ను చూసేవారు కాదు’ అంటున్నాడు ‘ఖిల్జీ’...అదేనండి రణ్‌వీర్ సింగ్. ఇంతకు విషయం ఏమిటంటే ఒక ప్రముఖ దినపత్రిక నిర్వహించిన ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018’ పోటిలో రణ్‌వీర్ సింగ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ ‘నేను చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడిని, అమ్మాయిలు నన్ను చూసేవారు కాదు. అయినా అప్పుడు నేను కూడా నా లుక్స్ గురించి అంతగా పట్టించుకునేవాడిని కాను’ అన్నాడు ఈ ‘బాజీరావ్’.
దీపికా పదుకోణ్ కొంటె మెసెజ్...
మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా తనను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ట్విటర్‌లో పోస్టు చేశాడు రణ్‌వీర్. దానికి దీపిక ‘యూ ఆర్ వెలకమ్’ అంటూ రీ ట్విట్ చేసింది. అసలు ఈ పోటి నిర్వహించినట్లు దీపకకు తెలుసో, లేదో తెలియదు కానీ ఈ క్రెడిట్‌ను మాత్రం తన ఖాతాలో వేసుకుందీ ‘మస్తానీ’. ‘పద్మావత్’ తర్వాత ఈ జంట ఇంతవరకు మళ్లీ ఏ చిత్రంలో కలిసి నటించలేదు
మరోసారి కాన్స్ వేదికపై...
ఈ నెల 10, 11 తేదీలలో జరగనున్న ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో మరోసారి రెడ్‌కార్పెట్ మీద హొయలొలికించనుంది. దీపిక ఈ వేడుకలకు హజరవడం ఇది రెండోసారి. ఈ వేడుకల్లో దీపిక ‘లోరియల్ ’ఉత్పత్తులకు ప్రచారకర్తగా పాల్గొననుంది.
Comments
Please login to add a commentAdd a comment