most desirable person
-
Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి.. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్
కుర్రకారు మనసు దోచిన లేటెస్ట్ తెలుగు హాట్‌స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి ఆ సంగతి రుజువు చేశారు. తాజాగా ఓ ఆంగ్లపత్రిక చేసిన సర్వేలో... విజయ్ దేవరకొండ వరుసగా ముచ్చటగా మూడో ఏడాది మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ పట్టం అందుకున్నారు. మునుపెన్నడూ ఎవరూ సాధించని ఈ ఫీట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’లో నటిస్తున్న ఈ రౌడీ స్టార్, వీలైతే వచ్చే ఏడాది కూడా ఈ టైటిల్‌ను నిలబెట్టుకుంటాననీ, ఇంకా కుదిరితే ఎవరూ అందుకోలేని రికార్డ్ నెలకొల్పాలని ఉందనీ సరదాగా చెప్పుకొచ్చారు. ‘భౌతిక దూరం పాటిస్తూ, బతికుండడమే ఎక్కువైన రోజుల్లో అమ్మాయిల కలల రాకుమారుడి పట్టం దక్కడం చిత్రమైన సంగతి’ అన్నారు విజయ్ దేవరకొండ. మరి, ఇంతమంది మనసు దోచిన ఈ స్టార్‌కి ఎలాంటి వాళ్ళంటే ఇష్టం? ‘స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతికేవాళ్ళంటే ఇష్టం. జీవితంలో ఒక లక్ష్యం, చేపట్టిన పని మీద పట్టరాని మోహం ఉన్నవాళ్ళను ఇష్టపడతా. ఆడ, మగ అని తేడా లేదు... అలాంటివాళ్ళు ఎవరైనా సరే నా చుట్టూ ఉండాలని కోరుకుంటా. అంత ఉద్వేగంతో జీవించేవాళ్ళ పట్ల నేను ఆకర్షితుణ్ణి అవుతా’ అని విజయ్ వివరించారు. లాక్ డౌన్‌తో ఇంట్లోనే గడుపుతున్న వేళ గంటల కొద్దీ వ్యాయామం చేయడానికి ఇబ్బంది లేకున్నా, ఖాళీగా కూర్చొని, ప్రతి అరగంటకూ ఏదో ఒకటి తినేయడం ఇబ్బందిగా ఉందట ఈ యూత్ ఐకాన్‌కి. తీపి పదార్థాలంటే పడిచచ్చే విజయ్ ఈ సీజన్లో మామిడి పండ్లు తెగ లాగిస్తున్నారట. దాంతో, డైట్ పాటించడం ఇబ్బందిగా ఉందని వాపోయారు. -
వరుసగా రెండోసారి రౌడీనే..
క్రేజీకి హిట్లు, ఫ్లాప్స్‌తో సంబంధం లేదని నిరూపించాడు టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ. మోస్ట్ డిజైరబుల్ మెన్-2019 జాబితాలో రౌడీ వరుసగా రెండో సారి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. గతేడాది కూడా విజయ్ ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రెండోస్థానంలో నిలిచాడు. రామ్ చరణ్ గతేడాది మూడో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది ఒక స్థానం మెరుగుపరుచుకొని రెండో స్థానంలోకి వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్‌తో పుంజుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని 2018లో తొమ్మిది స్థానంలో ఉండగా ఈసారి ఏకంగా మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అనూహ్యంగా ప్రభాస్ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 9 నుంచి 19వ స్థానానికి పడిపోయాడు. వరుణ్ ఏడవ స్థానం, సుధీర్ బాబు తొమ్మిది, బుల్లితెర యాంకర్ ప్రదీప్ పదవ స్థానంలో ఉన్నారు. (అది నా పర్సనల్: విజయ్ దేవరకొండ ) పూర్తి జాబితా: 1. విజయ్ దేవరకొండ 2. రామ్ చరణ్ 3. రామ్ పోతినేని 4. ప్రభాస్ 5. సల్మాన్ జైదీ 6. బషీర్ అలీ 7. వరుణ్ తేజ్ 8. సుధీర్ బాబు 9. ప్రదీప్ మాచిరాజు 10. ప్రణవ్ చాగంటి 11. నాగ చైతన్య 12. అల్లు అర్జున్ 13. రోహిత్ ఖందేల్వాల్ 14. అఖిల్ అక్కినేని 15. నవదీప్ 16. మహ్మద్ సిరాజ్ 17. సమీర్ ఖాన్ 18. శ్రావణ్ రెడ్డి 19. జూ.ఎన్టీఆర్ 20. కార్తికేయ 21.శర్వానంద్ 22. కిదాంబి శ్రీకాంత్ 23. నితిన్ 24. తరుణ్ భాస్కర్ 25. ఆది పినిశెట్టి 26. సందీప్ కిషన్ 27. నాని 28. నవీన్ పొలిశెట్టి 29. అడివి శేష్ 30. విశ్వక్ సేన్ రౌడీని రంగంలోకి దింపిన ప్రభుత్వం -
అమ్మాయిలు చూసేవారు కాదు: నటుడు
‘మోస్ట్ డిజైరబుల్ వ్యక్తిగా ఎన్నికయినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ నా చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడిని...అమ్మాయిలేవరు నన్ను చూసేవారు కాదు’ అంటున్నాడు ‘ఖిల్జీ’...అదేనండి రణ్వీర్ సింగ్. ఇంతకు విషయం ఏమిటంటే ఒక ప్రముఖ దినపత్రిక నిర్వహించిన ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018’ పోటిలో రణ్వీర్ సింగ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ ‘నేను చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడిని, అమ్మాయిలు నన్ను చూసేవారు కాదు. అయినా అప్పుడు నేను కూడా నా లుక్స్ గురించి అంతగా పట్టించుకునేవాడిని కాను’ అన్నాడు ఈ ‘బాజీరావ్’. దీపికా పదుకోణ్ కొంటె మెసెజ్... మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా తనను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ట్విటర్లో పోస్టు చేశాడు రణ్వీర్. దానికి దీపిక ‘యూ ఆర్ వెలకమ్’ అంటూ రీ ట్విట్ చేసింది. అసలు ఈ పోటి నిర్వహించినట్లు దీపకకు తెలుసో, లేదో తెలియదు కానీ ఈ క్రెడిట్‌ను మాత్రం తన ఖాతాలో వేసుకుందీ ‘మస్తానీ’. ‘పద్మావత్’ తర్వాత ఈ జంట ఇంతవరకు మళ్లీ ఏ చిత్రంలో కలిసి నటించలేదు మరోసారి కాన్స్ వేదికపై... ఈ నెల 10, 11 తేదీలలో జరగనున్న ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో మరోసారి రెడ్‌కార్పెట్ మీద హొయలొలికించనుంది. దీపిక ఈ వేడుకలకు హజరవడం ఇది రెండోసారి. ఈ వేడుకల్లో దీపిక ‘లోరియల్ ’ఉత్పత్తులకు ప్రచారకర్తగా పాల్గొననుంది. -
మహేష్ 6.. రానా 11.. ప్రభాస్ 13
గతేడాది(2015)కు గానూ భారత్ లో మోస్ట్ డిజైరబుల్ పర్సన్ ఎవరన్నది తాజా పోల్స్ లో తేలిపోయింది. భారతదేశంలో మొత్తం 50 మంది పేర్లు చెప్పి.. వాళ్లలో ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతి ఏడాది లాగానే పోల్ సర్వే నిర్వహించగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు. మొత్తం 1.17 లక్షల ఓట్లతో టాప్ లేపాడని చెప్పవచ్చు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరో స్థానం దక్కించుకున్నాడు. ఐదు సర్వేలలో టాప్ టెన్ లో నిలిచిన ఏకైక వ్యక్తిగా మహేష్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలవగా, ఫవాద్ ఖాన్, హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. గతేడాది టాప్ 10 లో ఉన్న టీమిండియా కెప్టెన్ ధోనీ ఈ సారి 14వ స్థానంలో నిలిచాడు. దక్షిణాన మహేష్ టాప్: గత రెండు సర్వేలలో 1,6 ర్యాంకుల్లో నిలిచిన దక్షిణాది నటుడు కేవలం మహేష్ బాబు ఒక్కడే. గత సర్వే ర్యాంకు 6ను మళ్లీ దక్కించుకుని సౌత్ లో తానే రారాజు అనిపించుకున్నాడు. ఐదు సర్వేలలో టాప్ 6 ర్యాంకుల్లో నిలిచిన ఏకైక వ్యక్తి మహేష్ కావడం విశేషం. ఈ జాబితాలో టాప్ 15లో మరో ఇద్దరు హీరోలు నిలిచారు. 'బాహుబలి'తో రికార్డులు సృష్టించిన హీరోలు ప్రభాస్, రానా దగ్గుబాటి సర్వేలో వ్యక్తులుగా నిలిచారు. రానా 11, ప్రభాస్ 13వ స్థానంలో నిలిచారు. గత రెండు సర్వేలలో 13, 17 ర్యాంకుల్లో నిలిచిన రానా ఈ ఏడాది కాస్త మెరుగవ్వగా, ప్రభాస్ మాత్రం తొలిసారి డిజైరబుల్ పర్సన్స్ లో చోటు సంపాదించాడు. -
మోస్ట్ డిజైరబుల్.. మహేష్‌బాబు
నెంబర్ 1.. కేవలం సినిమా పేరు మాత్రమే కాదు, దేశవాసులు అత్యంత ఎక్కువగా కోరుకునే (మోస్ట్ డిజైరబుల్) జాబితాలో కూడా నెంబర్ 1 ఎవరో కాదు.. ప్రిన్స్ మహేష్ బాబు!! భారతదేశంలో మొత్తం 50 మంది పేర్లు చెప్పి.. వాళ్లలో ఎక్కువగా ఎవరిని కోరుకుంటారని టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ పోల్ నిర్వహించగా, మొత్తం 7.34 లక్షల మంది ఓట్లు వేశారు. గత రెండేళ్లుగా టాప్ 5 స్థానాల్లో నిలుస్తూ వచ్చిన మహేష్ బాబు.. ఈసారి ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ రెండో స్థానం మాత్రమే పొందగలిగాడు. 2011లో ఐదో స్థానంలోను, 2012లో రెండో స్థానంలోను ఉన్న మహేష్.. ఈసారి నేరుగా అగ్రపీఠాన్ని అందుకున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఏడు లక్షల మంది ఓట్లు వేస్తే వాటిలో ఎక్కువగా మహేష్‌కే వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ కూడా తాము ఎక్కువగా కోరుకునేది మహేష్ బాబునేనని, ఒక అవకాశం దొరికితే అతడితో కలిసి నటించాలనుకుంటున్నామని చెప్పారు!! గతంలో శ్రీనువైట్లతో దూకుడు తీసి బ్రహ్మాండమైన హిట్ సాధించిన మహేష్‌కు వాస్తవానికి 1.. నేనొక్కడినే సినిమా కలెక్షన్ల పరంగా కాస్త నిరాశనే మిగిల్చింది. అయితే, ఇప్పుడు మళ్లీ శ్రీనువైట్లతోనే 'ఆగడు' సినిమా తీస్తూ.. మళ్లీ పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రతో మరో బంపర్ హిట్ సాధించేందుకు మహేష్ సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే దేశవాసులు ఎక్కువగా కోరుకునే నటుడిగా నెంబర్ 1 స్థానం దక్కడం మహేష్‌బాబుకు మంచి ఊపునిచ్చింది. తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మహేష్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతిసినిమాలోనూ కష్టపడి అభిమానులను సంతోషపెట్టాలన్నదే తన ఉద్దేశమని ఈ సందర్భంగా అన్నాడు. ఇలా నెంబర్ 1 స్థానం రావడం వెనక తన అభిమానుల అండదండలు ఉన్నాయని, వాళ్లవల్లే తాను ఇక్కడ ఉన్నానని చెప్పాడు.