మోస్ట్ డిజైరబుల్.. మహేష్బాబు | mahesh babu stands number 1 in most desirable persons | Sakshi
Sakshi News home page

మోస్ట్ డిజైరబుల్.. మహేష్బాబు

Published Fri, May 23 2014 10:54 AM | Last Updated on Sun, Jul 14 2019 1:42 PM

మోస్ట్ డిజైరబుల్.. మహేష్బాబు - Sakshi

మోస్ట్ డిజైరబుల్.. మహేష్బాబు

నెంబర్ 1.. కేవలం సినిమా పేరు మాత్రమే కాదు, దేశవాసులు అత్యంత ఎక్కువగా కోరుకునే (మోస్ట్ డిజైరబుల్) జాబితాలో కూడా నెంబర్ 1 ఎవరో కాదు.. ప్రిన్స్ మహేష్ బాబు!! భారతదేశంలో మొత్తం 50 మంది పేర్లు చెప్పి.. వాళ్లలో ఎక్కువగా ఎవరిని కోరుకుంటారని టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ పోల్ నిర్వహించగా, మొత్తం 7.34 లక్షల మంది ఓట్లు వేశారు. గత రెండేళ్లుగా టాప్ 5 స్థానాల్లో నిలుస్తూ వచ్చిన మహేష్ బాబు.. ఈసారి ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ రెండో స్థానం మాత్రమే పొందగలిగాడు. 2011లో ఐదో స్థానంలోను, 2012లో రెండో స్థానంలోను ఉన్న మహేష్.. ఈసారి నేరుగా అగ్రపీఠాన్ని అందుకున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఏడు లక్షల మంది ఓట్లు వేస్తే వాటిలో ఎక్కువగా మహేష్కే వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ కూడా తాము ఎక్కువగా కోరుకునేది మహేష్ బాబునేనని, ఒక అవకాశం దొరికితే అతడితో కలిసి నటించాలనుకుంటున్నామని చెప్పారు!!

గతంలో శ్రీనువైట్లతో దూకుడు తీసి బ్రహ్మాండమైన హిట్ సాధించిన మహేష్కు వాస్తవానికి 1.. నేనొక్కడినే సినిమా కలెక్షన్ల పరంగా కాస్త నిరాశనే మిగిల్చింది. అయితే, ఇప్పుడు మళ్లీ శ్రీనువైట్లతోనే 'ఆగడు' సినిమా తీస్తూ.. మళ్లీ పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రతో మరో బంపర్ హిట్ సాధించేందుకు మహేష్ సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే దేశవాసులు ఎక్కువగా కోరుకునే నటుడిగా నెంబర్ 1 స్థానం దక్కడం మహేష్బాబుకు మంచి ఊపునిచ్చింది. తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మహేష్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతిసినిమాలోనూ కష్టపడి అభిమానులను సంతోషపెట్టాలన్నదే తన ఉద్దేశమని ఈ సందర్భంగా అన్నాడు. ఇలా నెంబర్ 1 స్థానం రావడం వెనక తన అభిమానుల అండదండలు ఉన్నాయని, వాళ్లవల్లే తాను ఇక్కడ ఉన్నానని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement