మహేష్ 6.. రానా 11.. ప్రభాస్ 13
గతేడాది(2015)కు గానూ భారత్ లో మోస్ట్ డిజైరబుల్ పర్సన్ ఎవరన్నది తాజా పోల్స్ లో తేలిపోయింది. భారతదేశంలో మొత్తం 50 మంది పేర్లు చెప్పి.. వాళ్లలో ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతి ఏడాది లాగానే పోల్ సర్వే నిర్వహించగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు. మొత్తం 1.17 లక్షల ఓట్లతో టాప్ లేపాడని చెప్పవచ్చు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరో స్థానం దక్కించుకున్నాడు. ఐదు సర్వేలలో టాప్ టెన్ లో నిలిచిన ఏకైక వ్యక్తిగా మహేష్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలవగా, ఫవాద్ ఖాన్, హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. గతేడాది టాప్ 10 లో ఉన్న టీమిండియా కెప్టెన్ ధోనీ ఈ సారి 14వ స్థానంలో నిలిచాడు.
దక్షిణాన మహేష్ టాప్:
గత రెండు సర్వేలలో 1,6 ర్యాంకుల్లో నిలిచిన దక్షిణాది నటుడు కేవలం మహేష్ బాబు ఒక్కడే. గత సర్వే ర్యాంకు 6ను మళ్లీ దక్కించుకుని సౌత్ లో తానే రారాజు అనిపించుకున్నాడు. ఐదు సర్వేలలో టాప్ 6 ర్యాంకుల్లో నిలిచిన ఏకైక వ్యక్తి మహేష్ కావడం విశేషం. ఈ జాబితాలో టాప్ 15లో మరో ఇద్దరు హీరోలు నిలిచారు. 'బాహుబలి'తో రికార్డులు సృష్టించిన హీరోలు ప్రభాస్, రానా దగ్గుబాటి సర్వేలో వ్యక్తులుగా నిలిచారు. రానా 11, ప్రభాస్ 13వ స్థానంలో నిలిచారు. గత రెండు సర్వేలలో 13, 17 ర్యాంకుల్లో నిలిచిన రానా ఈ ఏడాది కాస్త మెరుగవ్వగా, ప్రభాస్ మాత్రం తొలిసారి డిజైరబుల్ పర్సన్స్ లో చోటు సంపాదించాడు.