ఐటమ్ నం.1 | film shooting reach to an end the exception of item song | Sakshi
Sakshi News home page

ఐటమ్ నం.1

Published Sat, Dec 14 2013 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

ఐటమ్ నం.1

ఐటమ్ నం.1

 స్టార్ హీరోల సినిమా అంటే... కథ, కథనం, నిర్మాణ విలువలు, సాంకేతిక హంగులు ఇవి మాత్రమే కాదు. వాటితో పాటు కాస్త మసాలా ఐటమ్స్ కూడా తోడవ్వాలి. ఆ మాత్రం ఘాటు లేకపోతే మాస్ ఇష్టపడరు. దర్శకుడు సుకుమార్‌కి ఆ విషయం బాగా తెలుసు. యువతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం పడాల్సిన శ్రమంతా పడతారాయన. సుకుమార్ సినిమాల్లోని రొమాంటిక్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఫన్, ఐటమ్ నంబర్లు విపరీతంగా పేలతాయంటే కారణం అదే. ప్రస్తుతం మహేష్‌తో ఆయన ‘1’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఫైనల్‌గా మిగిలివున్న ఐటమ్ సాంగ్‌ని ముంబయ్‌లో చిత్రీకరిస్తున్నారు సుకుమార్. ఐటమ్‌సాంగ్స్ చిత్రీకరణలో సుకుమార్‌ది ఓ ప్రత్యేక శైలి.

‘ఆర్య’లోని ‘అ అంటే అమలాపురం’, ‘ఆర్య-2’లోని ‘రింగ రింగ’, ‘100%లవ్’లోని ‘పిల్లా నీ బావనిస్తవా’... ఇలా ఆయన ఐటమ్‌సాంగ్స్ అన్నీ బంపర్‌హిట్లే. వాటిని తలదన్నేలా ఈ ఐటమ్ నంబర్‌ని దేవిశ్రీప్రసాద్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ పాటలో సూపర్‌స్టార్‌తో జతకట్టే అవకాశాన్ని సోఫీ చౌదరి కొట్టేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. మహేష్ తనయుడు గౌతమ్ బాలనటునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కీర్తి సనన్ కథానాయిక. నాజర్, సయాజీ షిండే, కెల్లీ డోర్జీ, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: పీటర్‌హెయిన్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement