ఒలంపిక్స్ తర్వాత అతిపెద్ద ఆకర్షణ గల వేడుక ఏదైనా ఉంది అంటే అది కేన్స్ ఫిలిం ఫెస్టివలే. ఏటా నిర్వహించే ఈ వేడుకలు ప్రపంచ దేశాల నుంచి నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు రెడ్‌కార్పెట్‌పై హోయల పోయేందుకు తహతహలాడుతుంటారు. ఆయా సినిమాల ప్రీమియర్ షో ప్రదర్శనలప్పుడు తాజా ఫ్యాషన్‌ను పరిచయం చేస్తూ నటీనటులు చేసే సందడి అంతా ఇంతా కాదు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తూ. అయితే ఈ సారి కేన్స్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ సెల్ఫీలను బ్యాన్ చేసేశారు.
మే 8 నుంచి మే 17 వరకు జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు సంబంధించి కొత్త ప్రొటొకాల్స్ జారీ అయ్యాయి. ఈ ప్రొటోకాల్స్‌లో ప్రెస్ వారి కోసం నిర్వహించే మార్నింగ్ స్క్రీనింగ్‌లను తీసేశారు. దాంతో పాటు రెడ్‌కార్పెట్‌పై హోయల్ పోతూ.. నటీనటులు దిగే సెల్ఫీలను కూడా బ్యాన్ చేసినట్టు తెలిసింది. వెరైటీకి ఇచ్చిన డైరెక్టర్స్ ఇంటర్వ్యూలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రీమాక్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారం ప్రెస్ కోసం ఉదయం పూట ప్రదర్శించే సినిమాలను రద్దు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అతిథులతో పాటే, జర్నలిస్టులు, విమర్శకులు సినిమాలను సాయంత్రం సమయంలోనే చూడాల్సి ఉందన్నారు. రెడ్ కార్పెట్‌పై సెల్ఫీలను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘దీనిపై కొంతమంది ప్రతికూలంగా స్పందిస్తూ.. నిరసనలు చేయొచ్చు. కానీ 10 ఏళ్ల క్రితం అసలు సెల్ఫీలనేవే లేవు. ప్రపంచంలో ఇది అసలు అంత ముఖ్యమైన విషయమే కాదు. కేన్స్‌కు వెళ్లేది సినిమాలు చూడటానికి, సెల్ఫీలు తీసుకోవడానికి కాదు’ అని తెలిపారు. కాగ, మే 8 నుంచి అంగరంగ వైభవంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో జరుగబోతోంది. దీనిపై అధికారిక ఎంపిక ఏప్రిల్ 12న ప్రకటించనున్నారు. అంతకముందు దీన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌గా పిలిచేవారు.
Comments
Please login to add a commentAdd a comment