స్ట్రగుల్ టు సక్సెస్
హైస్కూల్, కాలేజీ రోజుల్లో నాటకాల్లో ఛాయా కదమ్ నటప్రతిభను మెచ్చుతూ ‘నువ్వు సినిమాల్లోకి వెళితే ఇక తిరుగు లేదు’ అన్నారు చాలామంది. కట్ చేస్తే... ‘అసలు నీకు నటన వచ్చా’ అని తిట్టాడు ఒక డైరెక్టర్. ఒక డైరెక్టర్ అయితే అసహనంతో కుర్చీని నేలకేసి కొట్టాడు. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అయితే ఏరోజూ వెనకడుగు వేయలేదు.
కట్ చేస్తే... ‘ఒక్క సీన్ అయినా ఫరవాలేదు’ అనుకునే స్థాయి నుంచి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’లో నటించే స్థాయికి చేరింది. ఈ చిత్రం కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘గ్రాండ్ ప్రి’ అవార్డ్ గెలుచుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ‘పార్వతి’ పాత్రలో నటనకు ప్రశంసలే కాదు అంతర్జాతీయ వేదికపై స్టాండింగ్ వొవేషన్ స్వీకరించింది ఛాయా కదమ్.
ముంబై శివారులోని కలీనాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది ఛాయ. తండ్రి ఓ మిల్లులో కార్మికుడు. స్కూలు రోజుల్లో కబడ్డీ బాగా ఆడేది. స్టేట్, నేషనల్ లెవెల్లో కూడా ఆడింది. ఆటలతో పాటు నటించడం అంటే కూడా ఇష్టం. హైస్కూల్, కాలేజీలో ఎన్నో నాటకాల్లో నటించింది. ఇంటర్మీడియెట్ ఫెయిల్ కావడంతో ‘ఫెయిల్యూర్’ అనేది తొలిసారిగా పరిచయం అయింది. ‘జయాపజయాలు జీవితంలో భాగం. ఫెయిల్యూర్ ఎదురైనా కుంగి΄ోనక్కర్లేదు. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి సెకండ్ ఛాన్స్ ఉంటుంది అనే విషయం ఎప్పుడూ మరచి΄ోవద్దు’ అనే మాట ఛాయను ముందుకు నడిపించింది.
‘టెక్స్‌టైల్ డిజైన్’ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపింది. అయితే సినిమాల్లో అవకాశం రావడం నాటకాల్లో నటించినంత వీజీ కాదనే విషయాన్ని ఆమె త్వరగానే అర్థం చేసుకుంది. స్ట్రగుల్స్ తర్వాత... రాక రాక ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు! ‘సినిమాల్లో నటించాలనుకునేవారికి నటప్రతిభతో పాటు బోలెడు ఓపిక ఉండాలి’ అనే మాటను మాత్రం ఎప్పుడూ మరచి΄ోలేదు ఛాయ.
తొలి రోజుల్లో ‘వన్ సీన్’ పాత్రలలోనూ నటించింది. ఆ ఒక్క సీన్ కోసం లొకేషన్‌లో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఎప్పుడూ ఓపిక కోల్పోలేదు. ‘ఒక్క సీన్ ఉంది. ఫలానా చోట షూటింగ్’ అని చెప్పేవారు. ΄÷ద్దున్నే లేచి ఆ ్రపాంతం చేరడానికి ్రపాణం మీదికి వచ్చేది. తీరా అక్కడికి వెళ్లాక... ‘ఈ రోజు షూటింగ్ క్యాన్సిల్’ అనే మాటను కూడా ఎన్నో సార్లు విన్నది. కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు వచ్చినప్పటికీ డైరెక్టర్‌ల అహం భరించలేని స్థాయిలో ఉండేది. దుఃఖం ఆగేది కాదు. దుఃఖంలోనే ఉంటే ఆ సాగరంలో ‘నటన’ కొట్టుకు΄ోతుంది. అందుకని ఎంత బాధ అనిపించినా అప్పటికప్పుడు ఆ బాధ నుంచి బయట పడి డైరెక్టర్‌కు నచ్చేంత వరకూ నటిస్తూనే ఉండేది. ఆమె ఓపిక, కష్టం వృథా ΄ోలేదు. మరాఠీ, హిందీ సినిమాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. కాన్స్ రూపంలో అంతర్జాతీయ వేదికపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
శ్రామిక వర్గ బలం
శ్రామిక వర్గ నేపథ్యం నుంచి వచ్చాను. నాన్న మిల్లు కార్మికుడు. అలా అని నేను ఎప్పుడూ ఎవరి నుంచి సానుభూతి ఆశించలేదు. అయితే నా నేపథ్యం నేను చేసిన అట్టడుగు, శ్రామిక వర్గ పాత్రలకు బలాన్ని ఇచ్చింది. నా పాత్రలకు అవసరమైన మెటీరియల్‌ను ఇచ్చింది.
– ఛాయా కదమ్
Comments
Please login to add a commentAdd a comment