కేన్స్లో మన 'మసాన్'కు రెండు అవార్డులు
ముంబై: కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ సినిమా 'మసాన్' కు అరుదైన గౌరవం దక్కింది. మసాన్ రెండు అత్యున్నత అవార్డులు గెల్చుకుంది. ఇంటర్నేషనల్ జ్యూరీ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ ప్రైజ్, ప్రామిసింగ్ ఫ్యూచర్ ప్రైజ్ సొంతం చేసుకుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులందరూ లేచి కరతాళధ్వనులతో అభినందించారు.
నీరజ్ ఘావన్ దర్శకత్వంలో అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా నీరజ్ తన తొలి చిత్రంతోనే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ఈ సినిమాలో రిచా చద్దా, సంజయ్ మిశ్రా, విక్కీ కౌశల్, శ్వేతా త్రిపాఠి నటించారు. నీరజ్, రిచా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కేన్స్లో అవార్డులు గెల్చుకున్న మసాన్ చిత్ర బృందాన్ని బాలీవుడ్ ప్రముఖులు అభినందించారు.