
పన్నెండు కోట్ల నెక్లెస్!
హాట్ గాళ్ మల్లికా శెరావత్ గులాబీ రంగు గౌనులో ఎర్ర తివాచీపై ఒయ్యా రంగా నడిస్తే.. ఎలా ఉంటుంది?
హాట్ గాళ్ మల్లికా శెరావత్ గులాబీ రంగు గౌనులో ఎర్ర తివాచీపై ఒయ్యా రంగా నడిస్తే.. ఎలా ఉంటుంది? వీక్షకుల మతిపోతుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ నగరంలో జరుగుతున్న కాన్స్ చలనచిత్రోత్సవాల్లో అలానే జరిగింది. గత కొన్నేళ్లుగా మల్లికా శెరావత్ ఈ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాల్లో గాల్లో ముద్దులు విసురుతూ, చిరునవ్వులు చిందిస్తూ... మల్లిక చాలామందిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ ఏడాది కూడా అదే చేశారు. అయితే, ఈసారి అందరి చూపులూ మల్లిక మెడపై కూడా నిలిచాయి. శంఖం లాంటి ఆ మెడకు ఓ అందమైన కంఠాభరణం అగుపించింది. మంచి డిజైనర్ నెక్లెస్ అది.
వజ్రాలు పొదిగిన ఆ కంఠాభరణం ఖరీదు 12 కోట్ల రూపాయలు. ‘‘ఈ ఖరీదైన ఆభరణం నా సున్నితమైన మెడకు అందం తెచ్చిన మాట సరే. కానీ, కాన్స్ చలన చిత్రోత్స వాల నుంచి ఇంటికి తిరిగొచ్చేవరకూ దాన్ని కాపాడే పెద్ద బాధ్యతతో నేను సతమతమైపోతున్నా. ఏది ఏమైనా నా మెడ అందాన్ని పెంచిన నా ముద్దుల నెక్లెస్‌కి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు’’ అన్నారు.