75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్‌లో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో మన సౌత్ హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నా, నయన తారలు కూడా మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచి విదేశి మీడియాను, అంతర్జాతీయ స్టార్స్‌ను ఆకట్టుకున్న పూజాకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ వేడుక కోసం తాను సిద్ధం చేసుకున్న నగలు, దుస్తులు, మేకప్ సామాన్ల బ్యాగ్‌లు పొగొట్టుకుందట ఈ బుట్టబోమ్మ. దీంతో తను, తన టీం అంతా ఆందోళనకు గురై ఒక రోజంతా ఏం తినకుండ ఉన్నామని చెప్పుకొచ్చింది పూజా.
చదవండి: Cannes Film Festival: కాన్స్ ఫిలిం ఫెస్టివల్ రెండో రోజు హైలైట్స్
అక్కడి విదేశి మీడియాతో ముచ్చటించిన ఆమె ఈ విషయం చెప్పుకొచ్చింది. ‘తొలిసారి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఆహ్వానం అందడంతో చాలా సంతోషపడ్డాను. ఇక్కడ రెడ్ కార్పెట్‌పై మెరిసేందుకు బ్యూటీ ప్రొడక్ట్స్, ఫ్యాషన్ వేర్ దుస్తులను నా టీం స్పెషల్‌గా డిజైన్ చేసింది. ఎంతో కష్టపడి అంతా సిద్ధం చేసుకున్నాం. తీరా ఫ్రాన్స్ వచ్చాక ఆ బ్యాగులు కనిపించకుండ పోయాయి. ఇండియా ఎయిర్‌పోర్టులోనే బ్యాగ్‌లు పోయాయి. ఎయిర్‌పోర్టులో నా బ్యాగ్స్ చెకిన్ అయ్యాయి. కానీ అందులో నా మేకప్, దుస్తులకు సంబంధించిన బ్యాగ్స్ మాత్రం కనిపించలేదు. తీరా ఫ్రాన్స్‌లో ల్యాండ్ అయ్యాకే అసలు విషయం తెలిసింది. దీంతో నేను, నా టీం ఆందోళనకు గురయ్యాం’ అని చెప్పుకొచ్చింది.
చదవండి: ఎన్టీఆర్ బర్త్‌డే, చరణ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
అనంతరం ‘రెడ్ కార్పెట్‌పై వాక్ చేసేందుకు అవసరమైన దుస్తులు లేకపోయేసరికి అందరిలో కంగారు మొదలైంది. బట్టలు, హెయిర్ ప్రొడక్ట్స్, మేకప్ కిట్లు అన్ని పోయాయి. దీంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో ఇండియాలో కొన్న బంగారు నగలు నా హ్యాండ్ బ్యాగులో ఉన్నాయి. దీంతో ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత నా టీంకి మేకప్ సామన్లు, దుస్తులు కొని తీసుకురమ్మన్నాను. వెంటనే వారు అవసరమైన వస్తువులన్నీ కొని తెచ్చారు’ అని చెప్పింది. అయితే బ్యాగ్స్ మిస్ అయ్యేసరికి టెన్షన్‌లో ఆ రోజంత తనతో పాటు తన టీం ఎవరు కూడా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయలేదని, రాత్రి రెడ్ కార్పెట్ వాక్ ముగిసిన తర్వాతే అందరం తిన్నామని పూజా తెలిపింది. కాగా ఈ ఫిలిం ఫెస్టివల్‌లో పూజా ఫెదర్స్ గౌన్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచి బుట్టబొమ్మలా మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment