కియారాకు అరుదరైన అవకాశం | Kiara Advani To Debut At Cannes Film Festival 2024 | Sakshi
Sakshi News home page

కియారాకు అరుదరైన అవకాశం

Published Wed, May 15 2024 1:23 PM | Last Updated on Wed, May 15 2024 3:09 PM

Kiara Advani To Debut At Cannes Film Festival 2024

ప్రతిష్టాత్మక 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో హీరోయిన్‌ కియారా అద్వానీ తొలిసారి సందడి చేయనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో భాగంగా రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్యానెల్‌లో కియరా ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తారట. మంగళవారం (మే 14) ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 25వరకూ జరగనున్నాయి. ఇప్పటివరకు దేశం తరఫున పలుమార్లు ప్రాతినిధ్యం వహించి, మెప్పించారు ఐశ్వర్యా రాయ్‌. ఆ తర్వాత సోనమ్‌ కపూర్‌ కూడా ఇండియా ప్రతినిధిగా మెప్పించారు. 

ఈ ఏడాది ఇండియాకి ప్రాతినిధ్యం వహించే అవకాశం కియరా అద్వానీని వరించింది. కాన్స్‌లో వేనిటీ ఫెయిర్‌ హోస్ట్‌ చేస్తున్న ‘రెడ్‌ సీ ఫిల్మ్‌ ఫౌండేషన్‌ ఉమెన్‌ ఇన్‌ సినిమా’ కార్యక్రమంలోనూ కియరా ΄ాల్గొంటారు. ప్రపంచ సినిమాకు ప్రొత్సాహకాలు, చిత్రీకరణ, సినిమా నిర్మాణంలో వస్తున్న సాంకేతిక అంశాలు.. వంటి వాటి గురించి నాలుగు ప్యానెల్స్‌ చర్చలు జరపనున్నాయి. మే 18న లా ప్లేజ్‌ డెస్‌ పామ్స్‌లో ఈ చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లోనూ కియారా పాల్గొంటారు. 

కాగా ఈ ఏడాది చిత్రోత్సవాల్లో ఐశ్వర్యా రాయ్, అదితీ రావ్‌ హైదరి, శోభితా ధూళి΄ాళ వంటి తారలు దేశం నుంచి హాజరు కానున్నారు. ఇప్పుడు కియారా అద్వానీ పేరు ఈ జాబితాలో చేరింది. ఈ చిత్రోత్సవాల్లో స్టయిలిష్‌గా కనిపించడానికి, చర్చల్లో తన అభి్ర΄ాయాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి కియారా చాలా ప్రిపేర్‌ అయ్యారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement