సిల్వర్ స్క్రీన్‌పై మెరుపు తీగలా కనిపించడానికి కథానాయికలు కఠినమైన కసరత్తులు చేస్తారు... డైట్ ఫాలో అవుతారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కో డైట్... చేసే వ్యాయామాలు కూడా వేరుగా ఉంటాయి. హీరోయిన్ కియారా అద్వానీ తానేం చేస్తారో ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. ‘‘నేను ఎంత త్వరగా బరువు పెరగగలనో అంతే త్వరగా తగ్గగలను. బరువు పెరగడం, తగ్గడం రెండూ నాకు సులభమే. డ్యాన్స్, స్విమ్ చేయడం చాలా ఇష్టం.
స్కూల్ డేస్‌లో అప్పుడప్పుడూ ఈ రెండూ చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే సినిమా రంగంలోకి వచ్చానో అప్పట్నుంచి వీటిని నేను నా దినచర్యలో భాగంగా ప్లాన్ చేసుకుని చేస్తున్నాను. జిమ్, డ్యాన్స్, స్విమ్మింగ్.. ఇవన్నీ ఫిట్‌నెస్‌లో భాగమే. వీటిని మనం ఇష్టంగా చేస్తే సరదాగా ఉంటుంది’’ అని చెప్పకొచ్చారు కియారా. ఇంకా తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ– ‘‘నచ్చిన ఆహారాన్ని అతిగా తినడం, ఉపవాసాలు చేయడం వంటివి పాటించను. మసాలా ఎక్కువగా ఉండని ఇంటి భోజనం తినడానికే ఇష్టపడతాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment