శ్రుతికి మరో అనుభవం | Another experience to Shrutihasan | Sakshi
Sakshi News home page

శ్రుతికి మరో అనుభవం

Published Tue, May 23 2017 2:15 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

శ్రుతికి మరో అనుభవం

శ్రుతికి మరో అనుభవం

శ్రుతీహాసన్‌ ప్రస్తుతం తన తండ్రి కమలహాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్రంతో పాటు ఒక హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ బ్యూటీ చేతిలో పెద్దగా చిత్రాలు లేకపోయినా యమా ఖుషీగా ఉన్నారు. అందుకు కారణం సంఘమిత్ర అనే భారీ చారిత్రాత్మక చిత్రంలో యువరాణిగా నటించనుండటం మాత్రమే కాదు, ఆ చిత్రం ప్రారంభానికి ముందే కేన్స్‌ చిత్రోత్సవాల్లో పరిచయమై ప్రపంచస్థాయిలో విశేష ప్రచారాన్ని పొందుతోంది.

చిత్ర యూనిట్‌తో కలిసి ఇటీవలే ఈ చిత్రోత్సవాల్లో హల్‌చల్‌ చేసిన నటి శ్రుతీహాసన్‌కు మరొక వేడుక అక్కడే రెడ్‌కార్పెట్‌ పరిచింది.‘హౌ టు టాక్‌ టు గర్ల్స్‌ ఎట్‌ పార్టీస్‌’ అనే హాలీవుడ్‌ చిత్ర ప్రీమియర్‌ షోకు అతిథిగా ఆహ్వానం అందుకున్నారు. ఈ చిత్ర రచయిత, ప్రఖ్యాత ఆంగ్ల రచయిత నెయిల్‌ గైమెన్‌ శ్రుతీని కేన్స్‌ చిత్రోత్సవాల్లో  చూసి ఆశ్చర్యపోయారట. వెంటనే తన కథతో తెరకెక్కిన ఈ చిత్ర ప్రీమియర్‌ షోకు ఆహ్వానించారట.

వీరిద్దరూ ఇంతకు ముందే ట్విట్టర్‌ ఫ్రెండ్స్‌ అట. ఒకరంటే ఒకరికి గౌరవం అట. శ్రుతీ బహుముఖ పత్రిభను నెయిల్‌ గైన్‌ తెగ పొగిడేశారు. ప్రతిగా తన అభిమాన రచయిత నెయిల్‌గైన్‌ అంటూ శ్రుతీహాసన్‌ పొగిడారు. నెయిల్‌ గైన్‌ నవలంటే తనకు చాలా ఇష్టం అని, ఆయన రాసిన నవలలు చాలా చదివానని శ్రుతీ పేర్కొన్నారు. ఆయనను అక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని శ్రుతీహాసన్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement