
కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో బాహుబలి
జాతీయవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపించడమే కాక ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో తన సత్తా చాటింది ‘బాహుబలి’.
జాతీయవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపించడమే కాక ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో తన సత్తా చాటింది ‘బాహుబలి’. ఇప్పుడు కాన్స్‌లో ప్రపంచ సినీ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. నిరుడు కాన్స్‌లో సినిమా ప్రచార కార్యక్రమాల నిమిత్తం ‘బాహుబలి’ టీమ్ సందడి చేసింది. ఇప్పుడీ సినిమా స్క్రీనింగ్ కోసం ఈ నెల 16న మళ్లీ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారు. అంతేకాక ‘వర్చువల్ రియాలిటీ’పై జరగనున్న చర్చలో దర్శకుడు రాజమౌళి, నిర్మాతల్లో ఒకరైన శోభూ యార్లగడ్డ పాల్గొంటున్నారు.