
ప్రతీ ఏడాది వేసవిలో ఫ్రాన్స్ దేశం మరింత కళకళలాడుతుంది. దానికి కారణం కాన్స్ చలన చిత్రోత్సవాలు. ఈసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 12 న మొదలు కావాలి. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రోత్సవాలు జరుగుతాయో లేదోననే సందేహాలు ఏర్పడ్డాయి. ‘‘మార్చి నెలాఖరులోగా కరోనా తీవ్రత తగ్గుతుందనే ఆశతో ఉన్నాం. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఫెస్టివల్‌ను క్యాన్సిల్ చేసే చాన్స్ ఉంది’’ అన్నారు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెసిడెంట్ పీర్రీ లీస్కూర్.
Comments
Please login to add a commentAdd a comment