
Aditi Rao Hydari About Cannes Film Festival 2022 Debut Experience: తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవల మహా సముద్రం, హే సినామిక చిత్రాలతో అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో తళుక్కుమంది. బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్ మాధవన్, పూజా హెగ్డేతోపాటు అదితి పాల్గొంది. వేడుకలో భాగంగా ఐదో రోజు రెడ్ కార్పెట్‌పై రెడ్ అండ్ పింక్ గౌన్‌లో అందంగా నడిచి ఆకట్టుకుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అదితి రావ్ హైదరీ.
'నేను చాలా పొట్టిగా ఉంటాను. అందుకే కేన్స్ ఫెస్టివల్‌లో ఉన్న జిరాఫీలతో (మిగతా హీరోయిన్స్ తనకన్నా హైట్‌గా ఉంటారన్న ఉద్దేశ్యంతో) పోటీపడలేనని మాటల సందర్భంలో సబ్యసాచితో (డిజైనర్) చెప్పాను. నేను నటిని. పొట్టిగా ఉన్నప్పటికీ నాకు బాధ లేదు. ఎందుకంటే నాలాగా ఉండటానికి నేను ఎంతో సౌకర్యవంతంగా ఫీల్ అవుతాను. అందుకే ధైర్యం చేసి ఫెస్టివల్‌లో పాల్గొంటాను. నేను చాలా తెలివితక్కువ పని చేయబోతున్నాను. రెడ్ కార్పెట్‌పై నడిచేప్పుడు కచ్చితంగా ఏదో ఒక పొరపాటు చేస్తాను. అప్పుడు నన్ను అందరు విమర్శిస్తారు. అయినా పర్లేదు. అంతా మన మంచికే. దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు.' అని అదితి చెప్పుకొచ్చింది. అయితే రెడ్ కార్పెట్‌పై ఎలాంటి పొరపాటు లేకుండా హొయలు పోయింది అదితి రావ్ హైదరీ.
చదవండి: లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ?
Comments
Please login to add a commentAdd a comment