Giraffes
-
ఈ జిరాఫీని తినొచ్చు
మీరు చదివింది నిజమే. ఈ జిరాఫీని తినేయొచ్చు. అడవుల్లో ఆకు లు, అలములు తిని బతికే జిరాఫీని మనం తినడం ఏంటి అని తిట్టుకుంటున్నారా? అపార్థం వద్దు.. ఎందుకంటే ఇది చాక్లెట్ జిరాఫీ. ఈవారం ఇంటర్నెట్ సంచలనంగా మారిన ఈ జిరాఫీని జూమార్ఫిక్ కలినరీ ఆర్ట్స్‌లో నిపుణుడైన అమౌరీ గుయ్‌చాన్ రూపొందించాడు. 8.3 అడుగుల పొడవైన ఈ జిరాఫీని పూర్తిగా వందశాతం చాక్లెట్‌తోనే తయారు చేశారు. దూరం నుంచి చూస్తే నిజమైన జిరాఫీని తలపిస్తున్న దీన్ని దగ్గరికి వెళ్తేగానీ శిల్పమని గుర్తించలేం. చాక్లెట్‌తో ఇప్పటికే సింహం, పులిలాంటి జంతువులను, మరెన్నో సముద్ర జీవులను, టెలిస్కోప్, క్లాక్ వంటి క్లాసిక్ వస్తువులను, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని సైతం రూపొందించిన అమౌరీ... ఇంత పెద్ద జంతువును తయారు చేయడం ఇదే మొదటిసారి. 72.5కిలోల బరువున్న ఈ జిరాఫీని రూపొందించడానికి ఏడురోజుల సమయం పట్టిందట. చాక్లెట్‌తో మరెన్నో తయారు చేయొచ్చని చెబుతూ... అమౌరీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తయారీ వీడియోను 8కోట్ల మంది చూశారు. -
ఆ హీరోయిన్స్‌ను జిరాఫీలు అన్న అదితి రావ్.. ఎందుకంటే ?
Aditi Rao Hydari About Cannes Film Festival 2022 Debut Experience: తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవల మహా సముద్రం, హే సినామిక చిత్రాలతో అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో తళుక్కుమంది. బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్ మాధవన్, పూజా హెగ్డేతోపాటు అదితి పాల్గొంది. వేడుకలో భాగంగా ఐదో రోజు రెడ్ కార్పెట్‌పై రెడ్ అండ్ పింక్ గౌన్‌లో అందంగా నడిచి ఆకట్టుకుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అదితి రావ్ హైదరీ. 'నేను చాలా పొట్టిగా ఉంటాను. అందుకే కేన్స్ ఫెస్టివల్లో ఉన్న జిరాఫీలతో (మిగతా హీరోయిన్స్ తనకన్నా హైట్‌గా ఉంటారన్న ఉద్దేశ్యంతో) పోటీపడలేనని మాటల సందర్భంలో సబ్యసాచితో (డిజైనర్) చెప్పాను. నేను నటిని. పొట్టిగా ఉన్నప్పటికీ నాకు బాధ లేదు. ఎందుకంటే నాలాగా ఉండటానికి నేను ఎంతో సౌకర్యవంతంగా ఫీల్ అవుతాను. అందుకే ధైర్యం చేసి ఫెస్టివల్లో పాల్గొంటాను. నేను చాలా తెలివితక్కువ పని చేయబోతున్నాను. రెడ్ కార్పెట్‌పై నడిచేప్పుడు కచ్చితంగా ఏదో ఒక పొరపాటు చేస్తాను. అప్పుడు నన్ను అందరు విమర్శిస్తారు. అయినా పర్లేదు. అంతా మన మంచికే. దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు.' అని అదితి చెప్పుకొచ్చింది. అయితే రెడ్ కార్పెట్‌పై ఎలాంటి పొరపాటు లేకుండా హొయలు పోయింది అదితి రావ్ హైదరీ. చదవండి: లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ? View this post on Instagram A post shared by Vivo India (@vivo_india) View this post on Instagram A post shared by Vivo India (@vivo_india) -
గుండెలు బరువెక్కేలా, కళ్లు చెమ్మగిల్లేలా..
Giraffe Death In Kenya: ఆరు జిరాఫీలు.. నీటి కోసం గట్లు, గుట్టలు, చెట్లు, పుట్టలు.. అడవంతా తిరిగాయి. ఒంట్లో సత్తువ నశిస్తున్నా, నిలబడటానికి కూడా ఓపిక లేకున్నా దాహం తట్టుకోలేక వెతికాయి. కాస్త దూరంలో ఏదో బురదలా కనిపించగానే నీళ్లుంటాయని పరుగున అక్కడికెళ్లాయి. అంతే.. ఆ బురదలోనే చిక్కుకుని నీరు లేక గొంతెండి.. తిండిలేక పేగులు మండి చనిపోయాయి. (చదవండి: హృదయ విదారకం.. చనిపోయిన తల్లి ఫోటోతో వధువు కన్నీళ్లు) గుండెలు బరువెక్కేలా, కళ్లు చెమ్మగిల్లేలా ఉన్న ఈ సంఘటన కెన్యాలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇటీవల జరిగింది. ఈ ఫొటోలను డిసెంబర్ 10న తీశారు. కొంతకాలంగా కెన్యా ఉత్తర ప్రాంతంలో వర్షాల్లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నీటి కోసం ఆ ప్రాంతంలోని ప్రాణులు అల్లాడుతున్నాయి. ఈ ఆరు జిరాఫీలు చనిపోయిన ప్రాంతానికి దగ్గర్లోని గరిస్సా కౌంటీలో 4 వేలకు పైగా జిరాఫీలున్నాయని, నీరు దొరక్కపోతే వీటికీ ప్రమాదం తప్పదని అక్కడి మీడియా చెబుతోంది. (చదవండి: అగ్ని పర్వతం బద్దలై.. బూడిదగా మారి‘నది’) -
నెహ్రూ జూ ఎన్‌క్లోజర్‌లోకి జిరాఫీలు
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతా నుంచి ఇటీవలే తెచ్చిన రెండు జిరాఫీలు బబ్లీ, బంటీలను కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. ఇవి జూ పార్క్ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడటంతో సందర్శకులు చూసేందుకు ఎన్‌క్లోజర్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే ఉన్న ఒక జిరాఫీకి ఈ రెండు తోడవటంతో వాటి సంఖ్య మూడుకు పెరిగింది. మరోవైపు ఇప్పటికే ఉన్న పక్షుల కేంద్రానికి అదనంగా మరో భారీ పక్షుల సందర్శన కేంద్రాన్ని నిర్మించేందుకు అటవీ శాఖ శంకుస్థాపన చేసింది. జంతువుల ఆవాసానికి మెరుగైన వసతులు కల్పించేలా జూను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, కొత్తగా ఏర్పాటు చేయబోయే వాకింగ్ ఎవియరీ (పక్షుల కేంద్రం) కచ్చితంగా అదనపు ఆకర్షణగా మారుతుందని పీసీసీఎఫ్ పీ.కే.ఝా అన్నారు. కార్యక్రమంలో మరో పీసీసీఎఫ్ పృథ్వీరాజ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, అదనపు పీసీసీఎఫ్‌లు మునీంద్ర, శోభ, డోబ్రియల్, సిద్ధానంద్ కుక్రేటీ, ఓఎస్డీ శంకరన్, జూ పార్క్ క్యూరేటర్ క్షితిజ, సిబ్బంది పాల్గొన్నారు. -
జూలో జిరాఫీల సందడి
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇన్నాళ్లు నైట్క్రాల్లో ఉన్న జిరాఫీలు ఆ బందిఖాన నుంచి విడుదలయ్యాయి. తమకు కేటాయించిన ఎన్‌క్లోజర్‌లోకి వచ్చి ఊపిరిపీల్చుకున్నాయి. హుషారుగా ఎన్‌క్లోజర్ చుట్టూ చక్కర్లు కొట్టాయి. సందర్శకులకు కనువిందు చేశాయి. రాష్ట్ర అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆదివారం జూలో వాటి మోటో వద్ద పచ్చ జెండా ఊపి సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టారు. దీంతో దాదాపు 20 రోజులుగా వాటిని చూడడానికి సందర్శకులు చేస్తున్న నిరీక్షణ ఫలించింది. విశాలమైన ఎన్‌క్లోజర్ చుట్టూ అవి సందడిగా తిరుగుతూ చెట్టుకొమ్మలను అందుకొని ఆకులు తింటూ సందర్శకుల అలరించాయి. జిరాఫీలను ఎన్‌క్లోజర్‌లో విడుదల చేసిన అనంతరం మంత్రి ఖడ్గమృగం, హంసలను కూడా అధికారికంగా సందర్శకుల కోసం విడిచిపెట్టారు. ఖడ్గమృగాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో కాన్పూర్ నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన విషయం విదితమే. ఇది బాగా అల్లరి చేయడంతో జూ అధికారులు సుమారు నాలుగు నెలల పాటు ముసుగులో ఉంచాల్సి వచ్చింది. అప్పటి నుంచి దీన్ని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి తరలించారు. సందర్శకుల కోసం సుమారు రెండు నెలల క్రితం విడిచి పెట్టారు. మళ్లీ ఆదివారం అధికారికంగా మంత్రి చేతులు మీదుగా దీన్ని ప్రారంభించారు. డాల్ఫినోరియం రద్దు.. కొన్నాళ్లుగా ప్రతిపాదనలో ఉన్న డాల్ఫినోరియం ఏర్పాటు రద్దయిందని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తెలిపారు. జూను సందర్శించిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ డాల్ఫినోరియంను జూ పక్కనే సముద్రం ఒడ్డున ఏర్పాటు చేయదలిచామని, అయితే దీనికి మెరైన్ శాఖ అభ్యంతరం పెట్టడంతో ఆ ప్రతిపాదనను అటవీశాఖ రద్దు చేసుకొందని వివరించారు. మూడేళ్లుగా జూ పార్కు బాగా అభివృద్ధి చెందిందన్నారు. అటవీశాఖలో కొత్తగా 3800 ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని, కొద్ది కోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని వెల్లడించారు.