
భారత్ అవకాశాల స్వర్గం...రండి
టోక్నో : భారత్ అవకాశాల స్వర్గం.... రండి కలిసి పని చేద్దామని... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...జపాన్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం జపాన్ పారిశ్రామిక వేత్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పెట్టుబడులకు భారత్ కంటే ఉత్తమమైన దేశమేదీ లేదన్నారు. పారిశ్రామిక నిబంధనలు సరళతరం చేస్తామని, పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని మోడీ తెలిపారు. రక్షణ సహా అన్ని రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో భారత్, జపాన్ల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయన్నారు. పదేళ్లలో జపాన్‌లో సాధించిన అద్భుతాన్ని భారత్‌లో రెండేళ్లలో ఆవిష్కరించ వచ్చని తెలిపారు. ఆసియాను బలోపేతం చేసేందుకు చేయి చేయి కలుపుదామని మోడీ సూచించారు. గత ప్రభుత్వం మూడేళ్లలో చేయలేనిది ....తాము వంద రోజుల్లో చాలా చేసి చూపించామని ఆయన తెలిపారు.