ఆమెకది అలవాటేనట! | Jennifer Lawrence falls yet again | Sakshi
Sakshi News home page

ఆమెకది అలవాటేనట!

Published Sun, Nov 15 2015 12:30 PM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

ఆమెకది అలవాటేనట! - Sakshi

ఆమెకది అలవాటేనట!

మాడ్రిడ్: హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ మరోసారి కాలు జారింది.  ప్రఖ్యాత  అమెరికన్ రచయిత సుజానే కోలిన్స్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సిరీస్  'ద హంగర్ గేమ్స్.. మాకింగ్ జే పార్ట్ 2' మూవీ   ప్రమోషన్ కార్యక్రమంలో  ఆమె కాలు జారి పడిపోయింది.  పొడవాటి తెల్లగౌనులో మెరిసిపోతూ మెట్లు ఎక్కుతున్నపుడు తడబడిందో, హైహీల్స్  మూలంగా బ్యాలెన్స్ తప్పిందో ఏమో తెలియదుకానీ, కాలు జారి కింద పడిందట.  వెంటనే తేరుకుని  గాల్లో చేతులు ఊపుతూ అభిమానులను నవ్వుతూ పలకరించిందట.

ముద్దుగుమ్మ కిందపోయిన ఈ  వీడియో ఇపుడు నెట్ హల్ చల్ చేస్తోంది. అటు ద హంగర్ గేమ్స్ ప్రొడ్యూసర్ నైనా జాకబ్ సన్  కూడా ఈ  విషయాన్ని ధృవీకరించారు.  ఆమె క్షేమం గురించి మీడియా ప్రశ్నించినపుడు ఆమెకిది అలవాటేగా.. షి ఈజ్‌ ఫైన్ అని కామెంట్ చేశారట.
.
మరోవైపు  లారెన్స్ ఇలా వేదికలపై కాలు జారడం ఇదే మొదటి సారి కాదు.  ఆమె నటించిన 'సిల్వర్  లైనింగ్స్ ప్లేబ్యాక్' సినిమాకుగాను 2013లో ఆస్కార్ అవార్డు స్వీకరిస్తున్నపుడు కూడా  రెడ్ కార్పెట్ పై   అలా  కాలు  జారి పడింది.  అలాగే  2014  ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో కారులోంచి దిగుతూ కూడా అమ్మడి కాలు స్లిప్ అయింది. కాగా  ఇటీవల విడుదలైన 'ద హంగర్ గేమ్స్.. మాకింగ్ జే పార్ట్ 2'  ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్  క్రియేట్ చేస్తోంది. నవంబరు 20న థియేటర్లను పలకరించనున్న ఈ మూవీపై హాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement