అందం.. అదితిరావు హైదరి సొంతం | Hrithik Roshan On Stunning Pic Of Aditi Rao Hydari | Sakshi
Sakshi News home page

మైండ్‌ బ్లాంక్‌ చేస్తోన్న ముద్దుగుమ్మ

Published Sat, Mar 20 2021 9:18 AM | Last Updated on Sat, Mar 20 2021 9:18 AM

Hrithik Roshan On Stunning Pic Of Aditi Rao Hydari - Sakshi

టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ .. అందంతోనూ, నటనతోనూ మెప్పిస్తున్న నటి అదితిరావు హైదరి. ఇటీవల టాప్‌ టు బాటమ్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో అభిమానుల మైండ్‌ బ్లాంక్‌ చేసేసింది. చెట్ల కలప నుంచి తీసిన గుజ్జుతో తయారైన టెన్సిల్‌ ఫ్యాబ్రిక్‌తో చూపులను చుట్టేసింది. ఈ డ్రెస్‌లో అద్భుతం అనిపించిన హైదరి ఆభరణాల జోలికి వెళ్లలేదు. వేళ్లకు రెండు బంగారు ఉంగరాలు, నలుపు రంగు హీల్స్‌ మాత్రమే ధరించింది. సహజసిద్దమైన స్కిన్‌ టోన్‌ మేకప్, దట్టమైన కనుబొమ్మల తీరు, వదిలేసిన హెయిర్‌ స్టైల్‌తో మెరిపించింది. ఈ ఫోటోపై బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ స్పందించాడు. స్టన్నింగ్‌ అంటూ కామెంట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement