నలుపు ‘కట్స్’ డ్రెస్‌లో...
వాలు కనులదానా... వయ్యారి నడకల మైనా... నలుపు ‘కట్స్’ డ్రెస్‌లో... మేని మెరుపుల వెలుగులో... బాలీవుడ్ చిన్నది ప్రియాంకాచోప్రా అలా అలా కులుకుతూంటే... లాస్‌ఏంజిల్స్‌లో మరో ఏంజిల్ ప్రత్యక్షమైన ఫీలింగ్. ఎందుకే నీకన్ని వగలా... ఒకసారి ఇటు చూడరాదా... అంటూ కెమెరా బృందం క్లిక్‌లు హోరెత్తిస్తుంటే... అక్కడున్నవారంతా ఆ స్టన్నింగ్ ‘బ్యూటీ’ని లైవ్‌లో చూసి లవ్లీగా ఫీలయ్యారు. ప్రి-గ్రామీ అవార్డు పార్టీకి అటెండైన ప్రియాంక... లాస్‌ఏంజిల్స్‌లోనే మూడు మాసాలు ఉంటుందట. ఓ విషయం తెలుసా... ఇంటర్నేషనల్ రికార్డింగ్ ఆర్టిస్ట్‌గా అమ్మడికి సక్సెస్‌ఫుల్ రికార్డు కూడా ఉంది. లాస్‌ఏంజిల్స్‌లో ఓ టీవీ షోతో పాటు, నాసా కోసం మ్యూజిక్ ప్రొడ్యూసర్ శ్యామ్ స్పీగల్‌తో కలసి ఓ సాంగ్ రికార్డింగ్‌లో ప్రియాంక పార్టిసిపేట్ చేయనుంది.