‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ చిత్రంలో ఎల్బీడీతో ఆడ్రీ హెప్‌బర్
పాశ్చాత్య దేశాలలోని సంపన్న మహిళల బట్టల బీరువాల్లో ఎల్బీడీ (లిటిల్ బ్లాక్ డ్రెస్) తప్పనిసరిగా ఉంటుంది. యువతుల ఫేవరెట్ డ్రెస్ అది. వాళ్లంతా ఎక్కువగా సాయంకాలపు వేడుకలకు దీనిని ధరించి వెళుతుంటారు. ఎక్కడైనా డ్యాన్స్ చేయాల్సి వస్తే అక్కడికి కూడా. ఎల్బీడీకి ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ప్రత్యేకంగా పేరే లేదు. లిటిల్ బ్లాక్ డ్రెస్. అంతే. ఈ డ్రెస్ సృష్టికర్త హ్యూబర్ట్ జివించీ తన 91వ ఏట.. మొన్న శనివారం రోజు కన్నుమూశారు. ఆయన అలా కన్నుమూయగానే ఎల్బీడీ చరిత్ర ప్రముఖంగా వార్తల్లోకి, వర్తమానంలోకి వచ్చింది.
1920లలోనే ఎల్బీడీకి ఒక రూపం ఉన్నప్పటికీ, హాలీవుడ్ చిత్రం ‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ హీరోయిన్ ఆడ్రీ హెప్‌బర్న్ కోసం హ్యూబర్ట్ డిజైన్ చేసిన ఎల్బీడీతో ఫ్యాషన్ రంగానికి ఒక కొత్త ఊపు వచ్చింది. ఆర్డర్లు పెరిగాయి. మార్కెట్ పెరిగింది. తనకే పేరూ లేకుండానే డిజైనర్‌కు పేరు తెచ్చిపెట్టిన డ్రెస్.. ప్రపంచ ఫ్యాషన్ చరిత్రలో బహుశా ఇదొక్కటే కావచ్చు.
హ్యూబర్ట్ జివించీ
Comments
Please login to add a commentAdd a comment