
సూపర్ స్టార్ మహేశ్ బాబు నేటితో 46వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. సోమవారం(అగష్టు 9) ఆయన పుట్టిన రోజు సందర్భంగా మహేశ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే మొత్తం మహేశ్ ఫొటోలు, ఆయనకు సంబంధించిన ట్యాగ్‌లే దర్శనమిస్తున్నాయి. సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకు ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఇక మహేశ్-నమ్రతల ముద్దుల తనయ సితార ఘట్టమనేని కూడా తండ్రికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపింది.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రి గురించి చెబుతూ సీతూ పాప పెట్టిన పోస్టు అందరిని ఆకట్టుకుంటుంది. మహేశ్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ అయితే మాకు మాత్రం మీరే ప్రపంచం. హ్యాపీ బర్త్‌డే నాన్న. మా ఆటల్లో, అల్లరిలో, నవ్వడం, పాడటం ఇలా అన్నింటిలోను మీరు మాకు బెస్ట్ డాడీగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు ఎల్లప్పుడు మిమ్మిల్నీ ప్రేమిస్తూనే ఉంటాను. లవ్ యూ నాన్న’ అంటూ సితార పోస్టు చేసింది.