
కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.. నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు లాక్‌డౌన్‌తో ఇంట్లో కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. కూతురు సితార, కొడుకు గౌతమ్‌తో కలిసి చిన్న పిల్లవాడిలా మారి సరదాగా ఆటలాడుతున్నారు. ప్రతి రోజు కొత్త లుక్‌లో దర్శనమిస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. (అదిరేటి లుక్‌లో మహేశ్.. సినిమా కోసమేనా?)
మహేశ్ పిల్లలతో చేసే ఎంజాయ్‌ను ఎప్పటికప్పుడు నమత్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ తన ముద్దుల కూతురు సితారతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. విశేషం ఎంటంటే ఈ ఫోటోలో మహేశ్ షర్ట్ లేకుండా కనిపించారు. మొదటి సారి తమ హీరోను షర్ట్ లేకుండా చూడటంతో ప్రిన్స్ అభిమానులు కాస్తా ఫిదా అవుతున్నారు. సూపర్ స్టార్ జిమ్ బాడీ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. (సితూ పాప కోసం సూపర్ స్టార్ ఏం చేశారంటే..)
Comments
Please login to add a commentAdd a comment