సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్‌ కుమారుడు.. డైరెక్టర్‌ ఎవరో తెలిస్తే..? | Jr Ntr Son Abhay Ram First Movie With Sitara | Sakshi
Sakshi News home page

Jr Ntr Son Abhay Ram: సితార పాపతో సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్‌ కుమారుడు ఎంట్రీ..?

Published Sat, Jul 15 2023 3:17 PM | Last Updated on Sat, Jul 15 2023 5:14 PM

Jr Ntr Son Abhay Ram First Movie With Sitara - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్​ సినిమాల్లోకి  బాలనటుడిగా తెరంగేట్రం చేయనున్నాడు. అది కూడా  సూపర్ స్టార్​ మహేశ్​బాబు కూతురు సితారతో కలిసి నటించబోతున్నాడు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయింది. దీంతో ​ జూ.ఎన్టీఆర్​ -  మహేశ్​బాబు ఫ్యాన్స్​కు పండుగ లాంటి వార్త అయింది. 

(ఇదీ చదవండి: గ్లామర్‌తో మతిపోగొడుతోన్న హనీరోజ్‌ .. సినిమా బ్యాన్‌ చేయాలంటూ..)

ఇప్పటికే  రవితేజ, సుధీర్​బాబు, మహేశ్ బాబు, అల్లు అర్జున్​ సహా వారి పిల్లలు పలు సినిమాల్లో కనిపించారు. ఘట్టమనేని సితార సర్కారు వారి పాటలో కనిపించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. తాజాగా జూనియర్​ ఎన్టీఆర్​ పెద్ద కుమారుడు అభయ్ రామ్ కూడా సినిమాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్ కూతురు సితార మల్టీటాలెంటెడ్​గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  దీంతో సోషల్​మీడియాలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్​ను సంపాదించుకుంది.

ఇండియాలోనే టాప్‌ దర్శకుడు అయిన రాజమౌళి తెరకెక్కించబోయే కొత్త సినిమాతో అభయ్​ రామ్​ ఎంట్రీ ఉండబోతుందని బలంగా ప్రచారం జరుగుతుంది. ప్రిన్స్‌ మహేశ్​బాబుతో కలిసి రాజమౌళి ఓ భారీ అడ్వెంచర్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదే సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ దాదాపు 15 నిమిషాల పాటు ఉండనుందని సమాచారం. ఇందులో నటించేందుకు సితార - అభయ్ రామ్​ను అక్కాతమ్ముళ్లుగా చూపించేందుకు జక్కన్న ప్లాన్‌ వేశారట. ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే  తారక్​ కుమారుడు మొదటిసారి సిల్వర్​ స్క్రీన్​పై మెరిసినట్టవుతుంది. 

(ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్‌ 7’లోకి బ్యాంకాక్‌ పిల్ల.. వీడియోతో క్లారిటీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement