టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ఒక్కడు, పోకిరి, మహర్షి, దూకుడు, సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను చిత్రాలు తనకెంతో ఇష్టమని ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే నమ్రతా మంగళవారం ఇన్‌స్టాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ యువర్ క్వశ్చన్’ సోషన్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.
మీకు ఇష్టమైన హీరో?
ఇది చాలా కష్టమైన ప్రశ్న(ఫన్నీ ఎమోజీస్). మహేశ్‌బాబు నా ఫేవరెట్ హీరో
మహేశ్‌బాబు నటించిన చిత్రాల్లో మీకే బాగా నచ్చేవి?
ఒక్కడు, పోకిరి, దూకుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను
మీరు రుచికరంగా చేసే వంటకం?
మ్యాగీ న్యూడిల్స్
మీ జీవితంలోని మధుర క్షణాలు గురించి చెప్పమంటే అంటే ఏం చెబుతారు?
మధుర క్షణాలు అంటే రెండు ఉన్నాయి. ఒకటి మహేశ్‌ను పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం
మహేశ్ బాబు సినిమాల విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవుతారా?
మహేశ్ సినిమా విషయాల్లో అస్సలు తలదూర్చను.
మహేశ్-పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా?
అది కాలమే చెప్పాలి
మీ తల్లిదండ్రులు తొలుత మీ ప్రేమను ఒప్పుకున్నారా?
మహేశ్‌ను తొలిసారి చూడగానే వారు కూడా ప్రేమలో పడిపోయారు.
మీకు ఇష్టమైన క్రికెటర్లు ఎవరు?
ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి
భవిష్యత్తులో మహేశ్‌తో కలిసి నటించే అవకాశం ఉందా?
ఈ జీవితకాలంలో అది మళ్లీ సాధ్యం కాకపోవచ్చని నాకనిపిస్తోంది.
సితార, గౌతమ్‌లలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు?
ఇద్దరూ బాగా అల్లరిచేస్తారు.
సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా?
ఇప్పుడే ఏం చెప్పలేం. ప్రస్తుతం తన ఏఅండ్‌ఎస్ యూట్యూబ్ ఛానల్ వీడియోలతో చాలా సంతోషం ఉంది.
ఇందిరమ్మ గురించి ఒక్క మాటలో చెప్పమంటే?
ప్రేమకు సంపూర్ణ రూపం
ఎవరు ముందుగా లవ్ ప్రపోజ్ చేశారు?
అది కరెక్ట్‌గా చెప్పలేం.
మీకు ఇష్టమైన ప్రదేశం?
స్విస్ ఆల్ఫ్స్
మీ అందానికి, ఆరోగ్యానికి రహస్యాలు
తృప్తిగా భోజనం చేయడం, మనశ్శాంతిగా నిద్ర పోవడం. రోజూ వ్యాయామం చేయడం
సితార యూట్యూబ్ ఛానల్‌లో మీరు గెస్ట్‌గా ఎప్పుడు వచ్చేది?
అది సితారకే తెలియాలి. చాలా తెలివిగా ఎంపిక చేసుకుంటుంది ఇంటర్వ్యూల కోసం.
మేడం మీ టాటూ చూపించగలరా?
Comments
Please login to add a commentAdd a comment