సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ కొత్త వీడియోనే షేర్ చేశాడు. శ్రీమంతుడు సినిమాలోని పాటను దేవీ ఆలపిస్తుండగా సితార డాన్స్ తన స్నేహితురాలు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యాతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశాడు దేవీ. ఈ వీడియోతో పాటు జూనియర్ మహర్షి (సితార) తనకు డాన్స్ చేయటం నేర్పిస్తోంది అంటూ కామెంట్ చేశాడు. గతంలోనూ సితార, ఆద్యాలతో కలిసి దిగిన ఫోటోలను వీడియోలను షేర్ చేశాడు దేవీ.