సర్కారు వారి పాట: పెన్నీ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది | Sarkaru Vaari Paata Second Single Penny Full Song Released | Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: పెన్నీ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

Published Sun, Mar 20 2022 4:24 PM | Last Updated on Sun, Mar 20 2022 4:28 PM

Sarkaru Vaari Paata Second Single Penny Full Song Released - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి నేడు(ఆదివారం) సెకండ్‌ సింగిల్‌ పెన్నీ ఫుల్‌ సాంగ్‌ విడుదలైంది. ‘ఎవ్రీ పెన్ని ఎవ్రీ పెన్ని’ అంటూ సాగే పాట ప్రోమోను నిన్న(శనివారం) రిలీజవగా తాజాగా ఫుల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ పాట ద్వారా తొలిసారి తండ్రితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుని వెండితెర ఎంట్రీ ఇచ్చేసింది సితార పాప.

కాగా పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్నారు. మే 12న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

చదవండి: మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో తమిళ బ్యూటీ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement