
Mahesh Babu Comments On Sitara Cute Dance To Kalavathi Song: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరేళ్ల వయసులోనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి తన యూనిక్ స్టైల్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. తండ్రికి తగ్గ కూతురిగానే కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార తాజాగా తండ్రి, మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు స్టైలిష్ స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది.
ఇది చూసిన సూపర్ స్టార్ మహేశ్‌బాబు.. 'మై స్టార్.. నన్ను బీట్ చేసింది' అంటూ ఇన్‌స్టాలో కూతురిపై ప్రశంసలు కురిపించారు. మహేశ్ భార్య నమ్రత సైతం ఇంకేం చెప్పగలను? లవ్‌యూ మై లిటిల్ వన్ అని పేర్కొంది. ఇక సితార డ్యాన్స్‌కు మహేశ్ అభిమానులు సహా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అచ్చం నాన్నలాగే సూపర్‌స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: 'కళావతి' పాటకు మహేశ్ బాబు కూతురు సితార స్టెప్పులు