ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న మహేశ్‌ | Mahesh Babu Finds Peace in Pool With His Children Gautam and Sitara | Sakshi
Sakshi News home page

Mahesh Babu: ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న మహేశ్‌

Published Mon, Oct 11 2021 2:09 PM | Last Updated on Mon, Oct 11 2021 2:54 PM

Mahesh Babu Finds Peace in Pool With His Children Gautam and Sitara - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తుంటాడు.  ఆయన పరశురాం ద​ర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఆ చిత్రంలో షూటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. ఈ సమయంలో కొంచెం గ్యాప్‌ తీసుకున్న ప్రిన్స్‌ భార్య, పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌లో ట్రిప్‌లో ఉన్నాడు.

తాజాగా ఈ ట్రిప్‌లో పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి ఈత కొడుతున్న ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇద్దరితో కలిసి శాంతిని కనుగొన్నట్లు క్యాప్షన్‌ ఇచ్చాడు. అలాగే ఆయన భార్య నమ్రతా సైతం ఈ ట్రిప్‌ సంబంధించి చిన్న వీడియోని షేర్‌ చేసింది. అందులో సూపర్‌ స్టార్‌ తన కూతురితో కలిసి లూసెర్న్‌లో నడుస్తున్నాడు. దీంతో ఇవీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారాయి.

చదవండి: నా సూపర్‌ ఉమెన్‌తో ఇలా, చాలా ఆనందంగా ఉంది: మహేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement