మహేశ్‌బాబు- నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల తనయ సితార అప్పుడే తండ్రి గర్వించే స్థాయికి ఎదిగింది. సితార తొలిసారిగా న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసిన సంగతి తెలిసిందే కదా! పీఎంజే జ్యువెలరీ యాడ్‌లో సితార నటించగా, అందుకు సంబంధించిన ఫోటోలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ఈ ప్రకటనలో నటించేందుకుగానూ సితార కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.
ఇకపోతే చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి అదుర్స్ అనిపించిన సితార మంచి డ్యాన్సర్ కూడా! అదిరిపోయే స్టెప్పులు వేసిన డ్యాన్స్ వీడియోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్రోజెన్ 2 సినిమా తెలుగు వర్షన్‌లో బేబీ ఎల్సా పాత్రకు కూడా తనే వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా పీఎంజే అనే జ్యువెలరీ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గానూ నిలిచింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తొలి పారితోషికంపై స్పందించింది. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను చారిటీకి ఇచ్చానంది సితార. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఆదర్శనీయంగా నిలిచిన మహేశ్‌బాబు అడుగుజాడల్లోనే సితార కూడా నడుస్తోందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment