
సూపర్ స్టార్ మహేశ్ బాబు ముద్దుల తనయ సితార సోషల్ మీడియోలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. అరేళ్ల వయసులో సోషల్ మీడియాలో అడుగుపెట్టి అందరిని అలరిస్తోంది. ఎప్పుడు డ్యాన్స్ వీడియోలు, తండ్రితో కలిసి సరదాగా ఇంట్లో సందడి చేస్తున్న ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆదివారం సెలవురోజు కావడంతో ఉదయాన్నే తండ్రితో కలిసి ఆడుకుంటున్న రెండు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది సితార పాప.
చదవండి: రవితేజపై ఖిలాడి డైరెక్టర్ రమేశ్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్, ఈ వివాదం మరింత ముదరనుందా?
ఈ ఫొటోలు చూస్తుంటే సితార తండ్రి మహేశ్ బాబుతో చిన్నపాటి ఫైట్‌కు దిగినట్లు కనిపిస్తోంది. అదే విధంగా ఈ ఫొటోలకు సితారా.. ‘నాన్న పీస్‌ఫుల్(సండే) డేను చెడగోట్టే విషన్‌లో బిజీగా ఉన్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మహేశ్ బాబు తన కూతురి ఇలా సరదగా ఆడుకోవడం చూసిన ఈ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేగాక ఈ ఫొటోలకు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి: దీపికా బోల్డ్ సీన్స్‌పై భర్త రణ్‌వీర్ స్పందన, ఏమన్నాడంటే..
Comments
Please login to add a commentAdd a comment