సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార చిన్నతనంలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టార్ హీరో కూతురుగానే కాక డ్యాన్స్, సింగింగ్ లాంటి వ్యక్తిగత టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. సితారకు తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ.. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా పేరెంట్స్‌కు మంచి బహుమతిని అందించి వారిపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకుంది.
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు పురస్కరించుకొని మహేష్, నమ్రతకు గ్రీటింగ్ కార్డు ఇచ్చింది సితార. దానిపై లవ్ యూ అమ్మ, నాన్న.. హ్యపీ వాలెంటైన్ డే అని రాసిచ్చింది. కూతురు నుంచి ఇలా ఊహించని గిఫ్ట్ అందడంతో మహేష్ దంపతులు ఎమోషనల్ అయ్యారు. ఇక కూతురు ప్రేమగా ఇచ్చిన గ్రీటింగ్ కార్డును అభిమానులతో పంచుకున్నాడు మహేష్. థ్యాంక్ యూ సితూ పాప అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. నమ్రత సైతం సితార గిఫ్టుకు మురిసిపోయి, థ్యాంక్యూ తల్లి అంటూ కూతురుపై ప్రేమను కురిపించింది.
ఇదిలా ఉండగా ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దుబాయ్‌లో జరుగుతుంది. అక్కడే ఫ్యామిలీతో ఉన్న మహేష్ బాబు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూనే షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు. గీత గోవిందం తర్వాత పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి 2022కు విడుదల కానుంది.
చదవండి : వైరల్ అవుతున్న సితార తాజా ఫొటోలు
Comments
Please login to add a commentAdd a comment