మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే మార్చి 20న ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం.
చదవండి: ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్
‘ఎవ్రీ ఎవ్రీ పెన్ని..’ అంటూ సాగే ఈ పాటలో మహేశ్ తనయ సితార ఘట్టమేనిన కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. చూస్తుంటే తండ్రి మూవీతోనే సితార వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో సితార గ్రూప్‌లో లీడ్ డ్యాన్సర్‌గా కనిపించింది. ఇందులో ఆమె స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి ఓ ఫారిన్ లేడి గ్రూప్‌తో డ్యాన్స్ చేస్తుంటే.. సితార మరో గ్రూప్‌తో లీడ్ డ్యాన్స్‌ర్‌గా ఆకట్టుకుంటుంది. ఇలా తండ్రి కూతుళ్లను ఒకే పాటలో చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment