సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి నేడు(ఆదివారం) సెకండ్ సింగిల్ ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ‘ఎవ్రీ పెన్ని ఎవ్రీ పెన్ని’ అంటూ సాగే పాట ప్రోమోను నిన్న(శనివారం) మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో అందరిని ఆశ్చర్యపరిచే ఓ సంఘటన చోటు చేసుకుంది. మహేశ్ బాబు కూతురు సితార ఈ పాటలో కనిపించి షాకిచ్చింది. తొలిసారి తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని వెండితెర ఎంట్రీ ఇచ్చేసింది సితార పాప.
చదవండి: Sarkaru Vaari Paata: సెకండ్ సింగిల్ అవుట్, ఆశ్చర్యపరిచిన సితార
దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంబరంలో మునిగితేలుతున్నారు. శనివారం(మార్చి 19) ప్రోమో విడుదలైన నేపథ్యంలో సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తిర పోస్ట్ షేర్ చేసింది. ‘పెన్ని సాంగ్ కోసం సర్కారు వారి పాట వంటి అద్భతమైన టీంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాన్న.. నిన్ను గర్వపడేలా చేస్తాను’ అంటూ సితార రాసుకొచ్చింది. కాగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment