సితార డాడీ కూతురు.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత | Mahesh Babu Comforts Sitara In New Pic Shared By Namrata Shirodkar | Sakshi
Sakshi News home page

సితార డాడీ కూతురు.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

Published Sun, Aug 30 2020 12:31 PM | Last Updated on Sun, Aug 30 2020 12:46 PM

Mahesh Babu Comforts Sitara In New Pic Shared By Namrata Shirodkar - Sakshi

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నమ్రతా అప్డేట్ ఇస్తూనే ఉంటోంది. తాజాగా మహేశ్‌, సితారకు కలిసి ఉన్నఓ  ఫోటోను నమ్రత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఆఫోటోలో సిరతా బేబీ కుర్చీలో పడుకొని ట్యాబ్‌లో ఏదో వీడియో చూస్తుంది. పక్కనే మహేశ్‌ కూర్చొని తన గారాల పట్టి ఏం చూస్తూందో అన్నట్లు ట్యాబ్‌లోకి చూస్తున్నాడు. సితార బేబీ డాడీ మహేశ్‌పై కాళ్లు వేసుకొని నవ్వుతూ వీడియో చూస్తుంది. నమ్రత ఈ ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ..సితార డాడీ కూతురు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.
(చదవండి : ఇంగ్లీష్‌ పాట‌కు ఇర‌గ‌దీసిన సితార‌)

 కాగా శనివారం మహేష్ బాబు ఇంట్లో వినాయక చవితికి సంబంధించిన వేడుకలకు సంబంధించిన వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి నమ్రతతో పాటు మహేష్ బాబు కొడుకు, కూతురు గౌతమ్ కృష్ణ, సితార ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. ఇక మహేశ్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని మన దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement