
స్టార్ హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలతోపాటుగా.. మహేష్ సినీ విశేషాలను కూడా ఆమె అభిమానులతో పంచుకుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. మహేష్ కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మహేష్ పిల్లలతో కలిసి చేసే అల్లరిని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా మహేష్ కుమార్తె సితార.. ఆయనకు హెడ్ మసాజ్ చేస్తున్న ఫొటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. హెడ్ మసాజ్ చాలా బాగుందనే ఫీడ్‌బ్యాక్ వచ్చిందని అన్నారు.
‘ఓవైపు జీజీ(గౌతమ్ ఘట్టమనేని) గేమ్ ఆడటం చూస్తున్నాం.. మహేష్‌కు మాత్రం హెడ్ మసాజ్ చేసేందుకు ఓ వాలంటీర్ దొరికింది. కేవలం రెండు నిమిషాల్లోనే పని పూర్తిచేసింది. అయితే అది బాగుందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది’ అని నమ్రత పేర్కొన్నారు. మరోవైపు సితార కూడా మహేష్‌కు హెడ్ మసాజ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. నాన్న హెడ్ మసాజ్ నచ్చిందని చెప్పడంతో.. తను చాలా ఆనందపడ్డానని సితార చెప్పారు. నాన్న హెయిర్ చాలా మొత్తగా, సాఫ్ట్‌గా ఉందని అన్నారు.