కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎప్పుడూ బిజీగా ఉండే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు ఖాళీ అయిపోయారు. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే మహేశ్ ఈ లాక్‌డౌన్ సమయంలో కాలు కూడా బయటకి పెట్టకుండా పిల్లలతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే గౌతమ్, సితారలతో కలిసి చేస్తున్న అల్లరి, ఆటలకు సంబంధించిన ఫోటోలు, వీడియలోను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మహేశ్ తనయ సితార తన తండ్రితో కలిసి ఇండోర్ స్విమ్మింగ్‌ఫూల్లో పోటీ పడింది. (సితు పాపను ఓడిస్తూ తాను ఓడుతూ)
తండ్రీ కూతుళ్లు స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను సితు పాప తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘నాన్నతో పోటీ అంటే చాలా సరదాగా ఉంటుంది. నాన్నతో నేను పాల్గొన్న మొదటి స్విమ్మింగ్ పోటీ ఇది’ అంటూ బుజ్జిబుజ్జి మాటలను జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు. మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (సితు పాప సింపుల్ యోగాసనాలు)
కూతురితో పోటీపడుతున్న మహేశ్
Published Sat, Jun 27 2020 8:50 PM | Last Updated on Sat, Jun 27 2020 8:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment