
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజుకి లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని జనాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొంతమంది అయితే భయంతోనే చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు సినీ, క్రీడా ప్రముఖులు. ప్రస్తుత పరిస్థితుల్లో పాత జ్ఞాపకాలను నెమరువేసుకోమని సలహా ఇస్తూ పోస్ట్ పెట్టింది సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత.
‘ప్రస్తుతం మన చుట్టూ విషాదాలు, దుర్భర పరిస్థితులే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ రోజు నా మొహంపై చిరునవ్వులు తీసుకొచ్చింది ఈ ఫోటో. ఇవన్నీ కూడా అద్భుతమైన మెమోరీస్. మీరు కూడా అలాంటి వాటిని వెతికి చూసుకోండి.. కాస్త నవ్వేందుకు ప్రయత్నించండి’అంటూ సితార చిన్నప్పటి ఫోటోని షేర్ చేసింది. దీనికి మెమోరీ థెరపీ అనే హాష్‌ట్యాక్‌ని యాడ్ చేసింది. ఇక బుల్లి సితార ఫోటోని చూసి మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సితార ఎంత క్యూట్‌గా ఉందో అంటూ మురిసిపోతున్నారు.
చదవండి:
ఎన్టీఆర్ తన పిల్లల ఫొటోలు, వీడియోలు ఎందుకు షేర్
నెట్టింట వైరలవుతున్న సుధీర్‌బాబు ఫ్యామిలీ ఫోటోలు
Comments
Please login to add a commentAdd a comment