సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో ఎంతగానో యాక్టివ్‌గా ఉంటుంది. ఏ పండగ సెలబ్రేట్ చేసుకున్నా, ఎక్కడికైనా వెకేషన్‌కు వెళ్లినా అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటుంది. అంతేకాదు అందంగా రీల్స్ చేస్తూ వాటిని అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. తన డ్యాన్స్ వీడియోలను కూడా పంచుకుంటుంది. అయితే ఈసారి మహేశ్‌బాబు సితార డ్యాన్స్ వీడియోను షేర్ చేశాడు.
అతడు సినిమాలోని 'పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి..' పాటకు స్టెప్పులేసిన సితార క్యూట్ డ్యాన్స్‌ను మహేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్టుకు డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ స్పందిస్తూ నెమలిలా నాట్యం చేస్తుందని కామెంట్ చేశాడు. నెటిజన్లు సైతం అద్భుతంగా స్టెప్పులేసిందని కొనియాడుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం అన్నా.. ఒక డౌట్.. ఇలాంటివి నువ్వే అప్‌లోడ్ చేస్తావా? లేకపోతే సితార పాప నీ ఫోన్ లాక్కుని అప్‌లోడ్ చేస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశాడు.
చదవండి: పఠాన్‌ను ఎవరూ ఆపలేరు.. ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ అంటే?
ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేవు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment