
నా ప్రపంచంలో వెలుగులు విరజిమ్మే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే అది నీ ఊహకు కూడా అందనంతగా!.. అంటూ మహేశ్‌బాబు..
Happy Birthday Sitara: సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార బర్త్‌డే నేడు (జూలై 20). ఈ సందర్భంగా మహేశ్ తన కూతురికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. '9వ పడిలోకి అడుగు పెట్టిన నా చిన్నారి పాపకు బర్త్‌డే శుభాకాంక్షలు. నా ప్రపంచంలో వెలుగులు విరజిమ్మే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే అది నీ ఊహకు కూడా అందనంతగా!' అంటూ ట్వీట్ చేశాడు. బెలూన్లు చేత పట్టుకుని కెమెరా వైపు స్మైల్ ఇస్తున్న సితార ఫొటోను సైతం అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సితార ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఇదిలా వుంటే మహేశ్ ప్రస్తుతం 'సర్కారువారి పాట' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 'మహానటి' ఫేం కీర్తి సురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో సెట్స్‌లో మహేశ్‌బాబు చెప్పిన ఓ భారీ డైలాగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ప్రత్యక్షం అవగా అదిప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
#HBDLittlePrincessSitara 🤗😍 pic.twitter.com/Zk2fdqbxw8
— Binnudhfm (@BaluDhfm7) July 20, 2021
Wishing you a very happy glorious birthday my lil parpie keep smile stay awesome...
— Rohi_lv_Mahi (@Rohi_lv_Mahi) July 20, 2021
Bundel of cuteness... pic.twitter.com/PpExflPx6v
❤️❤️❤️ pic.twitter.com/l2movz37Nd
— Vyshnavi Yshu✨DHFM💙 (@vyshnavi66666) July 20, 2021