Do You Know That Nita Ambani Makeup Artist Gets Paid More Than Most CEOs, Know Details - Sakshi
Sakshi News home page

పర్ఫెక్ట్‌ బిజినెస్‌ లేడీ నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్‌ తెలుసా మీకు!

Published Wed, May 10 2023 3:10 PM | Last Updated on Wed, May 10 2023 4:17 PM

do you that Nita Ambani makeup artist gets paid more than most CEOs - Sakshi

సాక్షి,ముంబై: ఆసియా బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ భార్య  నీతా అంబానీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌గా ఆమె తన స్టయిల్‌, ఫ్యాషన్‌తో అభిమానులను కట్టిపడేస్తారు.

(ఇదీ చదవండి: NMACC: నీతా అంబానీ అద్భుతమైన డ్యాన్స్‌,  మీరూ ఫిదా అవ్వాల్సిందే!)

ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ, తనదైన శైలితో ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. జ్యుయల్లరీ, హ్యాండ్‌బ్యాగ్‌లు, పాదరక్షలతోపాటు అధునాతన డ్రెస్సింగ్ సెన్స్, మేకప్‌తో తల నుండి కాలి వరకు పర్ఫెక్ట్‌గా కనిపించేలా లేడీ. ఈ నేపథ్యంలో నీతా అంబానీ బ్యూటీ  సీక్రెట్‌, ప్రతి ఈవెంట్‌లోనూ అందంతో మెస్మరైజ్‌ చేసే నీతా అంబానీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ గురించి తెలుసుకుందాం.  (లగ్జరీ డ్యూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?)

ముఖ్యంగా నీతా  బ్యూటీ వెనుక ఉన్న  పాపులర్‌  మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్  పాత్ర గురించి తెలిస్తే ఔరా అంటారు.  పాపులర్‌ సెలబ్రిటీలకు  మేకప్‌మేన్‌గా పనిచేసిన మిక్కీ టోక్యో బ్యూటీ పార్లర్‌లో పని చేసేవారు. చాలా ‍ క్లిష్ట సమయంలో  నటి హెలెన్ హెయిర్ డ్రస్సర్‌గా చేస్తూ.. ఆమె సలహా మేరకే చిత్ర పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అలా హమ్ అప్కే హై కౌన్, దిల్ టు పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కల్ హో నా హో, మొహబతేం, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్,  గుడ్ వంటి బాలీవుడ్ సినిమాలకు మేకప్ మేన్ గా పని చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటీమణుల్లో కరీనా కపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ   దాకా మిక్కి క్లయింట్లే కావడం గమనార్హం. 

కానీ నీతా అంబానీకి మాత్రం మిక్కీ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్. నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీతో పాటు కోడలు శ్లోకా అంబానీకి కూడా మిక్కీనే మేకప్ వేస్తారు.  ముంబైలో తన సేవలకు  ఒక్కో వ్యక్తికి రోజుకు లక్షల రూపాయల్లోనే  వసూలు చేస్తారు. అంబానీల దగ్గర పనిచేస్తున్న మిక్కీ జీతం పలు కంపెనీల సీఈవోల శాలరీ కంటే ఎక్కువేనట. ఇదే ఇపుడు హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. (శాంసంగ్‌ 32 అంగుళాల స్మార్ట్‌టీవీ: కేవలం రూ. 5వేలకే)

నీతా అంబానీకి  తన అందమైన కళ్లను ఆకర్షణీయంగా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. తన ఐబ్రోస్‌ ఎపుడూ నీట్‌ షేప్‌లో ఉండేలా చూసుకుంటారు. ఎప్పుడూ మాస్కరాను మర్చిపోరు. ఒక విధంగా అదే ఆమె సిగ్నేచర్‌ లుక్‌. అంతేకాదు నీతా అంబానీ కస్టమైజ్డ్ లిప్‌స్టిక్‌ కలెక్షన్‌ చూస్తే దిమ్మతిరగాల్సిందే. బంగారం, వెండితో తయారు చేసిన ఈ లిప్‌స్టిక్‌ బాటిళ్ల ధర  దాదాపు రూ.40 లక్షలకు పైమాటే.

కాగా కేవలం గ్లామర్‌ విషయంలోనే కాదు ముంబై ఇండియన్స్ ఓనర్‌గా,  రిలయన్స్ ఫౌండేషన్  ఫౌండర్‌ చైర్‌పర్సన్‌గా   రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ధీరూభాయ్ అంబానీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేతగా నీతా అంబానీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అంతేనా.. అంబానీ కుటుంబానీకి చెందిన ప్రతీ ఈవెంట్‌లోనూ నీతా సాంప్రదాయ నృత్య ప్రదర్శన ఉండి తీరాల్సిందే.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement