చై-సామ్‌ కాపురంలో చిచ్చు: 'అక్కా అని పిలిచే వ్యక్తితో'.. | Samantha Makeup Artist Sadhana Strong Reply To Trolls About Preetham | Sakshi
Sakshi News home page

Chaysam Divorce: 'సమంత- ప్రీతమ్‌కు మధ్య ఉన్న రిలేషన్‌ ఇదే..తెలివి తెచ్చుకోండి'

Published Thu, Oct 7 2021 9:19 AM | Last Updated on Thu, Oct 7 2021 12:43 PM

Samantha Makeup Artist Sadhana Strong Reply To Trolls About Preetham - Sakshi

Chaysam Divorce: మంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఎంతో చూడముచ్చటైన ఈ జంట  విడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. మూడేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ అక్టోబర్‌2న సామ్‌-చై ఇక భార్యభర్తలుగా కొనసాగలేమంటూ ప్రకటించారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా విడిపోతారని కలలో కూడా అనుకోలేదు అంటూ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విడాకులకు అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా అని పలువురు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో  సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకాల్కర్‌ కూడా ఓ కారణమే అంటూ పలువురూ అతడిని నిందిస్తున్నారు. సమంతతో ఉన్న పాత ఫొటోలను షేర్‌ చేస్తూ సామ్‌-చై కాపురంలో చిచ్చుపెట్టావ్‌ అంటూ ప్రీతమ్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై సమంత పర్సనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ సాధనా సింగ్‌ స్పందించింది. చదవండి: నెటిజన్ల ట్రోల్స్‌: చై-సామ్‌ విడాకులకు కారణం ఇతడేనా!?

సమంత-ప్రీతమ్‌కు మధ్య ఉన్న బంధాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి ప్రీతమ్‌..సమంతను అక్కా(జీజీ)అని పిలుస్తాడు. జీజీ అంటే అర్థం తెలుసు కదా..అంటూ ఘాటుగా బుదులిచ్చింది. ఆ దేవుడు నాకు తెలివిని ప్రసాదించాడు. దీన్ని కొందరు తెలివిలేని వాళ్లకు పంచుదామని అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. 

చదవండి: విడాకుల ఎఫెక్ట్‌: షూటింగ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement