జాక్వెలిన్ ఫెర్నాండెజ్
బీటౌన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త కారు కొన్నారు. ఇక ముంబై వీధుల్లో రయ్ మంటూ జాక్వెలిన్ దూసుకెళ్లడమే తర్వాయి అనుకుంటున్నారా! ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆమె కారు కొన్నది తన కోసం కాదు. తన మేకప్ ఆర్టిస్టు షాన్ ముల్తైల్ కోసం. అసలు మేటర్ ఏంటంటే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దగ్గర షాన్ కొన్నేళ్లుగా మేకప్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. రీసెంట్‌గా తన బర్త్‌డే. ఈ సందర్భంగా జాక్వెలిన్ ఓ ఖరీదైన కారును షాన్‌కు బహుమతిగా ఇచ్చారు.
ఈ సడెన్ గిఫ్ట్ చూసి షాన్ షాకయ్యారట. ‘‘జాక్వెలిన్.. మీరు నిజంగా నన్ను సర్‌ప్రైజ్ చేశారు. మీరు కారు దగ్గరికి వెళ్తుండగా వీడియో తీయమని అడిగినప్పుడు అది నా కోసమేనని ఏ మాత్రం ఊహించలేదు.. థ్యాక్యూ’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడట షాన్. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం జాక్వెలిన్ ‘రేస్3, డ్రైవ్’ సినిమాల్లో నటిస్తున్నారు. రెమో డిసౌజా దర్వకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘రేస్ 3’ చిత్రం ఈ ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment