international stage
-
Miss World 2024 Photos: అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సెలబ్రిటీల డామినేషన్ (ఫోటోలు)
-
గాంధర్వ గాయని
కంచిపట్టు చీరతో, చక్కని ముఖ వర్చస్సుతో వేదిక మీద కనిపించే సుబ్బులక్ష్మి పాట ఎంతో పవిత్ర భావనను వెదజల్లేది. అందుకే ‘ఆమె కర్ణాటక సంగీత రాజ్యానికి రాణి’ అన్నారు జవహర్లాల్. ‘భారత కోకిల’ అన్నారు కవికోకిల సరోజినీదేవి. ఆమె ‘సుస్వరలక్ష్మి’ అని కీర్తించాడు బడే గులాం అలీఖాన్. ఒక సందర్భంలో ఏపీజే అబ్దుల్‌కలాం తన జీవితంలో ముగ్గురు తల్లులు ఉన్నారని చెప్పారు. ఆ ముగ్గురు - ఒకరు కన్నతల్లి, మరొకరు మదర్ థెరిసా, మూడో తల్లి - ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఎంఎస్ సుబ్బులక్ష్మి ‘తపస్విని’ అన్నారు లతా మంగేష్కర్. ఇటీవలే సెప్టెంబర్ 16న విశ్వవ్యాప్త సంగీత ప్రపంచం సుబ్బులక్ష్మి శత జయంతిని జరుపుకుంది. ఆ సందర్భంగా ఎంఎస్ బయోగ్రఫీ. రాగం మీద మరింత దృష్టిని ప్రతిష్టించడానికి ప్రతి కీర్తనకు ముందు ఆమె క న్నుల మీద సుతారంగా వాలేవి రెప్పలు. ఇప్పుడు సంగీత ప్రియుడైన ఏ భారతీయుడు కర్ణాటక సంగీతాన్ని తలుచుకుంటూ ఎప్పుడు అలా కళ్లు మూసుకున్నా వాళ్ల దృష్టిపథంలోకి ఆమె ప్రత్యక్షమవుతారు. ఆమె.. మదురై షణ్ముఖవాదివు సుబ్బులక్ష్మి. ఇరవయ్యో శతాబ్దపు కర్ణాటక సంగీత సంప్రదాయానికి ప్రత్యేక కీర్తిని సాధించిపెట్టిన అపురూప భారతీయ వనిత. ఏడు దశాబ్దాల పాటు అలుపనేది లేకుండా గానించిన గళం ఆమెదే. ఎలాంటి ఇతర పోకడలకు చోటులేని వంద శాతం కర్ణాటక సంప్రదాయాన్ని ఎంఎస్ గొంతు సొంతం చేసుకుంది. 1927లో పదకొండేళ్ల ప్రాయంలో తిరుచిరాపల్లిలో ఒక కచేరీతో ఆరంభమైన ఆ గాన వాహిని చివరి వరకు గానప్రియులను అలరిస్తూనే ఉంది. ఒక జన్మలో వీలయ్యేదా?! సుబ్బులక్ష్మిని 20వ శతాబ్దపు కర్ణాటక సంగీతానికి ప్రతీక అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆమె ఇచ్చిన కచేరీలు వేల సంఖ్యలో ఉంటాయి. వాటిలో చాలావరకు కొన్ని సంస్థలకు నిధులు సమకూర్చిపెట్టడానికి ఆమె ఉచితంగా పాడారు. తొలిరోజులలోనే రికార్డిస్టుగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఎన్నో రికార్డులు ఇచ్చారు. ప్రపంచం ఆమె పాటను మైమరచి ఆలకించింది. ఇంత కృషి మరో కళాస్రష్ట జీవితంలో సాధ్యమయ్యేది కాదేమో! ఒక జన్మలో చేయడానికి వీలయ్యేది కూడా కాదేమో! రికార్డింగ్ సంస్థల కోసం ఆమె పాడిన మొదటి పాట ‘మరకతం వడివుయం’. ఈ పాటకి పక్క వాయిద్యాలను అందించిన వారిలో షణ్ముఖివాదివు కూడా ఉన్నారు. ఆమె గొప్ప వైణికురాలు. సుబ్బులక్ష్మి కన్నతల్లి. అమ్మమ్మ వాయులీనంలో ప్రావీణ్యం కలిగి ఉండేవారు. రికార్డిస్టుగా ‘స్టార్’ హోదా రావడంతో స్వస్థలం మదురై నుంచి ఆ కుటుంబం మద్రాసుకు తరలి వచ్చింది. కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి సాంస్కృతిక రాజధాని వంటి చెన్నపట్టణానికి ఆమె గాన మాధుర్యం పరిచయం కావడం ఎంతో యాదృచ్ఛికంగా జరిగిపోయింది. సరస్వతి కటాక్షించినట్టే జరిగింది. ప్రఖ్యాత మద్రాసు మ్యూజిక్ అకాడమిలో ఏర్పాటయిన కచేరీని, నాటి సంగీత విద్వాంసులలో ఒకరైన అరియకుడి రామానుజ అయ్యంగార్ హఠాత్తుగా అస్వస్థులు కావడం వల్ల రద్దు చేసుకున్నారు. నిర్వాహకులు సుబ్బులక్ష్మి చేత మొదటిసారి పాడించారు. 1933 డిసెంబర్లో ఇది జరిగింది. తరువాత కొన్నేళ్లకి ఆ అకాడమి ఇచ్చే అత్యుత్తమ పురస్కారం ‘సంగీత కళానిధి’ సుబ్బులక్ష్మి స్వీకరించారు. వెండితెరపై సువర్ణగాత్రం ఎంఎస్ సువర్ణగాత్రం వెండితెర మీద కూడా వెన్నెలలు విరబూయించింది. అక్కడ కూడా ఆమె ఒక వెలుగు వెలిగారు. మున్షీ ప్రేమ్‌చంద్ అద్భుత నవల ‘సేవాసదన్’ ఆధారంగా నిర్మించిన చిత్రంలో ఎంఎస్ నటించారు. 1938లో ఆ చిత్రం విడుదలయింది. వారణాసి నేపథ్యంలో ఒక సాధారణ గృహిణి ఎలాంటి పరిస్థితులలో గడప దాటిందో ఈ కథలో ఆ మహా రచయిత మహోన్నతంగా ఆవిష్కరించారు. ఇందులో కట్నం సమస్యను కూడా ప్రస్తావించారాయన. ఆ ఒక్క చిత్రంతోనే సుబ్బులక్ష్మి గాయక నటిగా వినుతికెక్కారు. 1940లో ఎల్లిస్ దున్గన్ ఎంఎస్తోనే శకుంతల చిత్రం నిర్మించారు. ఆ తరుణంలోనే ‘కల్కి’ సదాశివంతో వివాహమైంది. సదాశివం ‘కల్కి’ పత్రిక నడిపేవారు. సి. రాజాజీకి సన్నిహితుడు. జాతీయోద్యమంలో పనిచేసేవారు. ‘కల్కి’ పత్రికకు నిధులు సమకూర్చడానికి ఎంఎస్ 1941లో నారద పాత్రతో ‘సావిత్రి’ చిత్రంలో కనిపించారు. అలనాటి ప్రఖ్యాత హిందీనటి శాంతా ఆప్టే సావిత్రి పాత్రలో కనిపించారు. మళ్లీ 1945లో ఎల్లిస్ దున్గన్ దర్శకత్వంలోనే ఎంఎస్ ‘మీరా’ చిత్రంలో కథానాయిక పాత్ర ధరించారు. మీరా చిత్రాన్ని జవహర్లాల్ నెహ్రూ, భారత ఆఖరి వైశ్రాయ్ మౌంట్‌బాటన్‌తో కలసి ఢిల్లీలో చూశారు. ఈ చిత్రంలో అన్ని పాటలూ ఎంఎస్ ఒక్కరే పాడారు. ఆ సినిమా చూసి, ఆ పాటలకు మైమరచి సరోజినీ నాయుడు ఎంఎస్‌ను ‘భారత కోకిల’ అని శ్లాఘించారు. ప్రాగ్, వెనీస్లలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా మీరాను ప్రదర్శించారు. ఎంఎస్ కీర్తి నలుదిశలా వ్యాపించింది. కానీ అదే ఆమె ఆఖరి చిత్రమైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎంఎస్ చలనచిత్ర జీవితానికి శుభం కార్డు వేసి, కర్ణాటక సంగీతానికే పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేశారు. అంతర్జాతీయ వేదికలపై... 1960లో అంతర్జాతీయ వేదిక మీద పాడేందుకు సుబ్బులక్ష్మికి మొదటిసారి అవకాశం వచ్చింది. అప్పటికే ఆకాశవాణి ద్వారా, కచేరీల ద్వారా కర్ణాటక సంగీత ప్రియులకు ఆరాధనీయ గాయనిగా మారిన ఎంఎస్‌ను ఎడిన్‌బరో ఉత్సవానికి ఆహ్వానించారు. 1963లో అక్కడ కచేరి జరిగిన తరువాత మరుసటి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంలో పాడేందుకు రావలసిందిగా నాటి ప్రధాన కార్యదర్శి యు థాంట్ ఆహ్వానించారు. 1966లో సమితి జనరల్ అసెంబ్లీలో కూడా ఆమె పాడారు. ఇది సుబ్బులక్ష్మి శతజయంతి అయితే, జనరల్ అసెంబ్లీలో ఆమె పాట పాడి యాభై ఏళ్లు పూర్తి కావడం కేవలం యాదృచ్ఛికం (జనరల్ అసెంబ్లీలో పాడిన మొదటి గాయని ఎంఎస్. రెండోసారి ఆగస్టు 16, 2016న అదే అవకాశాన్ని పొందిన వారు ఏఆర్ రెహమాన్. ఆ సందర్భంలో రెహమాన్ ఎంఎస్‌కు ఘనంగా నివాళి సమర్పించారు). ఈ కచేరీ నిజంగా చరిత్రాత్మకం. ఆ కార్యక్రమంలో ఆమె మొత్తం 30 గీతాలు పాడారు. అవి ఆరు భాషలకు చెందినవి. అదొక అపురూప ఘట్టం. జెనీవాలోని రెడో విల్లాలో పాడే అవకాశం కూడా భారతదేశం నుంచి ఎంఎస్కే లభించింది. విశ్వవిఖ్యాత సంగీతకారుడు బీతోవెన్ ఒకసారి కచేరి చేసిన వేదిక అది. పారిస్, లండన్, న్యూయార్క్ నగరాలు కూడా ఎంఎస్ గానవాహినలో తడిసినవే. ఔన్నత్యంలో తపస్విని ఎంఎస్ జీవితాంతం ఆరాధించిన కళ, ఆమెను భూగోళానికి పరిచయం చేసిన పాట ఎంఎస్‌ను ఒక తపస్విని స్థాయికి తీసుకువెళ్లాయి. సుబ్బులక్ష్మి, మరో ప్రఖ్యాత విదుషీమణి డీకే పట్టమ్మాళ్ చెన్నైలో ఒకే వీధిలో ఉండేవారు. ఆ వీధికి సుబ్బులక్ష్మి పేరు పెట్టదలిచామని మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. కానీ అందుకు ఎంఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ వీధికి ఏదైనా ఒక పేరు పెట్టాలి అంటే, అది పట ్టమ్మాళ్ పేరు మాత్రమే అయి ఉండాలని చెప్పారామె. ఆమె సంగీత సామ్రాజ్యంలో రాణి అయినా, ఔన్నత్యంలో మాత్రం తపస్వినే. అదే చెబుతోంది ఈ ఉదంతం. మీరా భజన్లు అద్భుతంగా ఆలపించిన ఆ దక్షిణాది గాయని ఉత్తర భారత ప్రజల హృదయాలను అలవోకగా గెలిచారు. పురుషాధిపత్యంతో సాగుతున్న కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో మహిళ గొంతును ప్రథమంగా బలంగా వినిపించారు. ఎంఎస్ సంగీతానికి శరీరం రాగమే కావచ్చు. కానీ దాని ఆత్మ భక్తి. ఆమె ఆలపించిన ఏ రాగమైనా భక్తిభావంతోనే తొణికిసలాడేది. భక్తిగీతమే ఈ చరాచర ప్రపంచంలో ఎక్కడ ఉన్న మనిషి హృదయాన్నయినా తాకగలుగుతుందని ఆమె విశ్వసించారు. చిరస్మరణీయం అయ్యారు. - డాక్టర్ గోపరాజు నారాయణరావు దేశానికి ఇష్టమైన పాట శంకర భగవత్పాదుల గీతాలు, శ్లోకాలు; మరాఠీ భక్తకవి తుకారామ్ గీతాలు, గురుగ్రంథ సాహెబ్‌లోని గీతాలు, మీర్జా గాలిబ్ ఉర్దూ ఘజల్స్ కూడా ఎంఎస్ గానం చేశారు. ఆమె పాడిన అన్నమాచార్య కీర్తనలు, వెంకటేశ్వర సుప్రభాతం ఏదో సందర్భంలో ఆలకించని ఇల్లు దక్షిణ భారతదేశంలో ఉండదు. ఇక బెంగాలీ భాషలో ప్రఖ్యాత జాతీయవాద కవి ద్విజేంద్రలాల్ రాయ్ రాయగా, ఎంఎస్ పాడిన పాట, ‘ధనో ధన్య పుష్పో భరా’ మన దేశంలో ఎందరికో అత్యంత ఇష్టమైన పాట. కాలాతీత గాత్ర మాధుర్యం గాంధీజీ టేప్ చేయించుకుని మరీ విన్నారు! గాంధీజీ 78వ జన్మదినం. ఆ అక్టోబర్ 2న గాంధీజీ కోసమే ఢిల్లీలో కొన్ని సంగీత కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, ఆ రోజున ఎంఎస్ వచ్చి, గాంధీజీకి ఎంతో ఇష్టమైన మీరా భజన్ ‘హరి తుమ్ హరో’ పాడగలరా అని అడుగుతూ ‘కల్కి’ కార్యాలయానికి ఫోన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేత సుచేతా కృపలానీ ఆ ఫోన్ చేశారు. అయితే ఆ భజన్ ఎంఎస్‌కు రాదనీ, అలాగే ఆ వారం ఢిల్లీకి రావడం కూడా సాధ్యం కాదనీ సదాశివం చాలా హుందాగా సుచేత ఆహ్వానాన్ని తిరస్కరించారు. మరెవరితో అయినా పాడించమని సలహా ఇచ్చారు. ఇక పుట్టినరోజు రెండు రోజులు ఉందనగా మళ్లీ ఫోన్. ఆ భజన్‌ను వేరొకరి కంఠం నుంచి వినడం కంటే, ఎంఎస్ ఆ పాటను టేప్ చేసి పంపితే వింటానని గాంధీజీ మరీ మరీ కోరినట్టు సుచేత చెప్పారు. ఇక తప్పలేదు. గాంధీజీ మీద గౌరవంతో సదాశివం ఆగమేఘాల మీద మద్రాసులోని ఆకాశవాణిలో రికార్డ్ చేయించి, ఢిల్లీ పంపించారు. ఆ విధంగా గాంధీజీ తన పుట్టిన రోజున ఆ భజన్ చెవులారా విన్నారు. కానీ, 1947లో జరిగిన ఆ పుట్టినరోజే చివరి పుట్టినరోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు. జనవరి 30, 1948న గాంధీజీ హత్యకు గురైయ్యారు. ఆ సమయంలోనే ఆకాశవాణి ఆయనకు నివాళిగా ఒక పాటను వినిపించింది. అది గాంధీగారి కోసం ఆ రోజు సుబ్బులక్ష్మి మద్రాసు ఆకాశవాణిలో రికార్డు చేసి పంపినదే. దానితో ఆమెపేరు ఇంటింటా మారుమోగింది. -
భారత మేధావులను తిరిగి రప్పిస్తాం: హర్షవర్ధన్
విదేశాల్లో ఉన్నవారిని రప్పించడానికి ప్రణాళిక సిద్ధం: కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు సగానికిపైగా తగ్గినప్పటికీ చౌక, పర్యావరణ అనుకూలమైన ఇంధన వనరుల అభివృద్ధికి భారతదేశం తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీ ‘మేకిన్ ఇండియా’ పిలుపునకు శాస్త్ర, సాంకేతిక రంగాలనే ఆలంబనగా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి హర్షవర్ధన్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి వై.సుజనా చౌదరి మాట్లాడారు. అమెరికాతోపాటు అనేక ధనికదేశాల్లో పరిశోధన.. అభివృద్ధి రంగాలు, పరిశ్రమల ఏర్పాటులో ఆసక్తి సన్నగిల్లుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారత సంతతి మేధావులను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విసృ్తత స్థాయి ప్రణాళికను సిద్ధం చేసిందని హర్షవర్ధన్ తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని వారు భారత్‌లోనే మెరుగైన వేతనాలతో పరిశోధనలు కొనసాగించేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టామని వివరించారు. ముడిచమురు గతంలో కంటే చౌకగా లభిస్తున్నప్పటికీ ఎన్నటికీ తరగని ఇంధన వనరులను ముఖ్యంగా సౌర శక్తిని చౌకగా అభివృద్ధి చేసేందుకు పరిశోధనలను ముమ్మరం చేస్తామని అన్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ ఇటీవలి విడుదల చేసిన నివేదిక ప్రకారం... ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకు మేధావులను అం దిస్తున్న పది నగరాల్లో ఎనిమిది భారత్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ నగరాల్లో దక్షిణాదికి చెందిన విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నైలు ఉండటం దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు శాస్త్రీయ అంశాలపై అవగాహనఅధికం అనేందుకు తార్కాణమని అన్నారు. ఇటీవల ముగిసిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో వేదకాలంలోనే విమానాలు తయారయ్యాయన్న అంశంపై పరిశోధన వ్యాసం చర్చకు రావడంపై ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ‘వైమానిక రంగంలో మాత్రమే కాదు.. వైద్య, సామాజిక రంగాల్లోనూ భారత్ గతంలో ఎన్నో అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. దానిపై ఒక పరిశోధన వ్యాసం వస్తే అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరమేమీ లేదు’ అని అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సైన్స్ సిటీలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సైన్స్ సిటీలు, శాస్త్ర, సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి వై.సుజనా చౌదరి తెలిపారు. జనాభాలో అధికశాతమున్న యువతను ఈ రంగాలవైపునకు మళ్లించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే దేశంలోని పరిశోధన సంస్థలను మరింత మెరుగైన రీతిలో పనిచేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పరిశోధన సంస్థలను, ఇన్క్యూబేషన్ సెంటర్లను అనుసంధానించాలని అనుకుంటున్నామని, మరో నెల రోజుల్లో ఈ కసరత్తు ముగించి కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపుతామని వివరించారు. -
సిటీ ఆఫ్ ఇన్నోవేషన్
ఈయన పేరు పార్క్స్ తావు.. జొహెన్నెస్‌బర్గ్ మేయర్. హైదరాబాద్ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ సిటీ అంటూ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారిలా... ‘నో డౌట్ .. హైదరాబాద్ ఈజ్ ఏ వెరీ హిస్టారికల్ సిటీ. మొదటి నుంచి ఇది మాకు ఇన్స్పిరేషన్. ఇన్నోవేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, మొబిలిటీ, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. ఈ విషయాలన్నింటిలో ఇది అంతర్జాతీయ స్థాయిలో బృహత్తర పాత్రపోషిస్తోంది. దీని నుంచి మేం నేర్చుకొనే అంశాలు చాలా ఉన్నాయి. ఇక్కడి యూత్ చాలా టాలెంటెడ్. వెరీ యాంబిషియస్ అండ్ అడ్వంచరస్. హెవీ ట్రాఫిక్ ఒక్కటే ఇక్కడి ప్రాబ్లమ్. యాక్చువల్‌గా ఇది ఇలాంటి బిగ్సిటీస్ అన్నిటికీ ప్రాబ్లమే... ఇన్క్లూడింగ్ జొహెన్నెస్‌బర్గ్. మెట్రో రైల్ ఆ ప్రాబ్లమ్నూ సాల్వ్ చేస్తుంది అనుకుంటున్నా. హైదరాబాద్ ఈజ్ సిటీ ఆఫ్ ఏ ఇన్నోవేషన్! - శరాది -
మెజీషియన్స్
అబ్రకదబ్ర అంటూ కాకిని కోకిల చేసే ‘మాయ’గాళ్లు మెజీషియన్లు. ఇన్నాళ్లూ మేజిక్ అంతా వన్‘వ్యూన్’ షోనే. ఇప్పుడిప్పుడే ఉమెన్ కూడా ఈ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ మెజీషియన్స్ షోలో లేడీ మెజీషియన్లు తమ ‘మాయ’లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ‘మాయ’గాళ్లకు దీటుగా ‘షో’ చేసి సత్తా చాటారు. ఈ సందర్భంగా వారిని పలకరించిన ‘సిటీప్లస్’తో మేజిక్ ఫీల్డ్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. ఫ్యామిలీ అంతా... మా నాన్న మెజీషియన్. మా చెల్లెలు కూడా అంతర్జాతీయ స్థాయిలో మెజీషియన్‌గా పేరుతెచ్చుకుంది. వాళ్ల స్ఫూర్తితోనే నేనూ ఈ రంగంలో అడుగుపెట్టా. ఇదో అద్భుతమైన కళ. ప్రేక్షకుల స్పందన, ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనివి. మా నాన్నే నా ఫేవరె ట్ మెజీషియన్. ఇప్పుడు ఇంటర్ చదువుతున్నా. భవిష్యత్తులో దీన్నే వృత్తిగా ఎంచుకుంటా. మహిళలు కూడా మగాళ్ల కంటే బాగా మేజిక్ చేయగలరని నిరూపించడమే నా ధ్యేయం. - జినియా నాన్న స్ఫూర్తితో.. మా నాన్న ప్రదీప్ ఇంటర్నేషనల్ మెజీషియన్. చిన్నప్పటినుంచి ఆయనను చూస్తూ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. ఐదేళ్ల నుంచే మేజిక్ చేస్తున్నా. నేను హైదరాబాద్‌లోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డ్యాన్స, పాటలు పాడటం వంటివి అందరూ చేస్తారు. మేజిక్ అలా కాదు.. ఇదో యూనిక్ టాలెంట్. అందుకే ఈ రంగంలో అడుగుపెట్టా. - శైలీ ప్రోత్సాహం బాగుంది.. మాది మహారాష్ట్రలోని పుణే. చిన్నప్పుడే మేజిక్ మాయలో పడిపోయా. మాటలు రాని వయసు నుంచి మేజిక్ చేస్తున్నా. మా ఇంట్లో బాగా ప్రోత్సహిస్తున్నారు కూడా. ఇక ఇందులో రాణించాలంటే రోజూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మంచి మెజీషియన్‌గా పేరు తెచ్చుకోగలం. - మజితా - ప్రవీణ్ కాసం -
పురుషులకూ సర్వైకల్ కేన్సర్ టీకా
నోబెల్ అవార్డు గ్రహీత హరాల్డ్ జూర్ హాసెన్ సూచన వ్యాక్సిన్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: గర్భాశయ ముఖద్వార కేన్సర్(సర్వైకల్ కేన్సర్) నిరోధక వ్యాక్సిన్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో మహా ప్రయత్నం జరగాలని నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ హరాల్డ్ జూర్ హాసెన్ పిలుపునిచ్చారు. సర్వైకల్ కేన్సర్‌కు హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) కారణమని గుర్తించిన ఈ శాస్త్రవేత్త మంగళవారం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో విలేకరులతో మాట్లాడారు. హాసెన్ పరిశోధనలు ఆసరాగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్ అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. సర్వైకల్ కేన్సర్‌తోపాటు కొన్ని ఇతర రకాల కేన్సర్ల నివారణకు మల్టీవాలెంట్ (వేర్వేరు వైరస్‌లను ఒకే టీకాతో నియంత్రించేవి) వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. సర్వైకల్ కేన్సర్ నిరోధక వ్యాక్సిన్‌ను 15-30 ఏళ్ల మధ్య వయసు వారందరికీ వేస్తే ఫలితాలు బాగుంటాయన్నారు. ఈ వయసు పురుషులకు లైంగిక భాగస్వాములు ఎక్కువగా ఉండటం వల్ల వీరి ద్వారా హెచ్‌పీవీ వైరస్ ఎక్కువమంది మహిళలకు వ్యాపించే అవకాశముండటం దీనికి కారణమని వివరించారు. అందువల్ల ఈ వయసు పురుషులకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లయితే హెచ్‌పీవీ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. - ఎనిమిదేళ్లుగా జరుగుతున్న వ్యాక్సినేషన్ సంతృప్తికరంగా సాగడం లేదు. వ్యాక్సిన్ ఖరీదు ఎక్కువ కావడమే కారణం. - అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛందసంస్థల సాయంతో తక్కువధరకే వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. - అన్ని రకాల కేన్సర్లను జయించేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. - కొన్నిరకాల పశుమాంసం ద్వారా కేన్సర్ వచ్చే అవకాశముందని మేం జరిపిన అధ్యయనం ద్వారా తెలిసింది. దీన్ని నిర్ధారించేందుకు ఆయా పశువుల రక్తంలో ఉన్న కొన్ని వినూత్న వైరస్‌లను వేరు చేసి ప్రయోగాలు నిర్వహిస్తున్నాం. - సీసీఎంబీ డెరైక్టర్ సి.హెచ్.మోహన్‌రావు మాట్లాడుతూ దేశంలో సర్వైకల్ కేన్సర్ నిరోధక వ్యాక్సిన్ రూ.8 వేలకు లభిస్తోందని, కొన్నిదేశాల్లో గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్(గావి) వంటి సంస్థలు రూ.300కే దీనిని అందుబాటులోకి తెస్తున్నాయని చెప్పారు. -
వివరం: ట్విటర్లో ఫాలోవార్
స్క్రీన్ మీద అలరించే సినీ తారలు సరదా కబుర్లు చెబుతున్నారు... ఆటతో స్టేడియంలో అలరించే క్రికెటర్లు కామెంట్లతో హల్చల్ చేస్తున్నారు... సంగీతకారులు సంభాషణలు పూరిస్తున్నారు... ఆధ్యాత్మికతను పంచే మతప్రవక్తలూ ఈ వేదికనే ఎంచుకున్నారు... వార్తలు చదివే జర్నలిస్టులు, వాగ్ధాటి గల రాజకీయవేత్తలు, నవలలు రాసే రచయితలు, దౌత్యవేత్తలు, దర్శకులు... ఆయా రంగాల్లో కాస్తంత పేరు కలిగిన వారెందరో ట్విటర్లో ఖాతాలు తెరిచి, ఎన్నో కబుర్లు చెబుతున్నారు! మరి వీరిలో బాగా అలరిస్తున్నదెవరు? అత్యధిక ఆదరణ కలిగినదెవరు? ఎవరు ఎక్కువమంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు? వారి మధ్య పోటీ ఎలా ఉంది? ట్విటర్లో సెలబ్రిటీల మధ్య నెలకొన్న ఫాలో‘వార్’ కథాకమామిషు... ప్రపంచ వ్యాప్తంగా రోజుకు పదిలక్షల మంది ట్విటర్లో అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు. పాపులేషన్ క్లాక్ కన్నా వేగంగా దూసుకెళ్తున్న ఈ నంబరింగ్ ప్రస్తుతానికి వెయ్యి మిలియన్ల అకౌంట్లను సూచిస్తోంది. వీటి నుంచి రోజుకు 275 మిలియన్ల ట్వీట్స్ వస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగా ట్విటర్.కామ్‌కు యాడ్‌రెవిన్యూ రూపంలో ఏడాదికి 259 మిలియన్ డాలర్లు సమకూరుతోంది. ఇది గణాంకాల విషయంలో ట్విటర్ బాహ్య స్వరూపం. మరి ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అంతర్గత స్వరూపంలో విషయానికి వస్తే...ట్విటర్లో ఖాతా ప్రారంభించిన ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గ లెక్కలో ఫాలోవర్లను సంపాదించుకుని, తమకెంత క్రేజ్ ఉందో చాటుకుంటున్నారు. అక్కడ పాప్స్టార్స్దే పై చేయి... అంతర్జాతీయ స్థాయిలో, మొత్తంగా ట్విటర్.కామ్‌లో ఉన్న అకౌంట్లన్నింటిలోనూ అత్యధిక స్థాయి ఫాలోవర్లను కలిగి ఉన్న సెలబ్రిటీ జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఈ పాప్ సింగర్‌కు ఏకంగా 4,85,51,731మంది ఫాలోవర్లున్నారు! ఆ తర్వాతి స్థానంలో పాప్‌సింగర్ లేడీగాగా ఉన్నారు. ఆమెకు 4,10,49,667 మంది ఫాలోవర్లున్నారు! మూడోస్థానంలో కేటీ పెర్రీ 4,09,80,666, నాలుగుస్థానంలో షకీరా 2,39,65,582 మంది ఫాలోవర్లతో రేసులో ఉన్నారు. ఫాలోవర్లను సంపాదించుకోవడం ఎలా? అప్పుడప్పుడు నాలుగైదు మాటలు మొహాన పడేసే వారి కన్నా ఎప్పుడూ తమకు కబుర్లు చెబుతూ... తమ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సెలబ్రిటీలకే ట్విటర్లో ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని మన సెలబ్రిటీలే నిరూపిస్తున్నారు. ఉదాహరణకు... ఆఫ్‌లైన్‌లో ప్రియాంక చోప్రా కన్నా సచిన్‌కే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు! అయితే ట్విటర్లో సచిన్ కన్నా ప్రియాంక చోప్రాకు ఎక్కువ ఆదరణ ఉందంటే ఇందుకు కారణం ఆమె చెప్పే క్యూట్ క్యూట్ కబుర్లే! అమావాస్యకూ పున్నమికి ట్విటర్ పేజ్‌లో ప్రత్యక్షమయ్యే సచిన్ కన్నా... ఉదయం కొశ్చన్‌కు సాయంత్రం రిప్లయ్ ఇచ్చే ప్రియాంక అంటేనే ట్విటర్ ప్రజలు పడి చస్తున్నారు! ట్విటర్లో కమల వికాసం! అత్యధిక స్థాయి ట్విటర్ ఫాలోవర్లను కలిగి ఉన్న రాజకీయవేత్త గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి. బీజేపీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన మోడీ ట్విటర్లో తన విధానాలను ప్రకటిస్తుంటారు. గుజరాత్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటుంటారు. 31,47,153 మంది ఫాలోవర్లున్నారాయనకు. మోడీ సంగతి ఇలా ఉంటే... ఎంపీ హోదాల్లో ట్విటర్ ఖాతాను నడిపేవారిలో కొంతమందికి ఆస్థాయి ఆదరణే ఉంది. ఈ జాబితాలో విజయ్‌మాల్యా 24,20,592తో తొలిస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానం కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్‌ది. ఆయనకు 20,20,762 మంది ఫాలోవర్లున్నారు. అయితే వీరిద్దరూ కేవలం రాజకీయనాయకులు మాత్రమే కాదు. వ్యాపారవేత్తగా మాల్యాకు, ఐరాసాలో పనిచేసిన వ్యక్తిగా శశికి ప్రత్యేక ఇమేజ్ ఉంది. దీంతో వీరికి ఫాలోవర్ల సంఖ్య సినీ, క్రికెట్ సెలబ్రిటీల స్థాయికి సమానం ఉంది. వీరిద్దరిని మినహాయిస్తే ఇక బీజేపీకే చెందిన సుష్మా స్వరాజ్‌కు 4,52,648 మంది ఫాలోవర్లున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల వ్యవహారాలను తప్పుపడుతూ మాత్రమే ట్వీట్లను ఇచ్చే జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణియన్ స్వామికి 1,67,395 మంది ఫాలోవర్లున్నారు. స్పందించే హృదయాలు... కొంతమంది ప్రముఖుల ట్విటర్ అకౌంట్లకు మంచి పాలోయింగ్ ఉంది. ట్విటర్ అకౌంట్లను కలిగి ఉన్న ఇతర తారలను తలదన్నే రీతిలో వారు ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అందుకు కారణం వారు స్పందించే తీరు. సామాజిక రాజకీయ అంశాల గురించి చేతన్ భగత్, అనపమ్ ఖేర్, ఆనంద్ మహీంద్రా, ప్రీతిశ్ నంది వంటి భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఎప్పటికప్పుడు సునిశిత విమర్శలను పోస్టు చేస్తుంటారు. వీరిలో చేతన్భగత్కు 15,22,946, అనుపమ్‌ఖేర్‌కు 14,06,163, ఆనంద్ మహీంద్రాకు 7,82,593, ప్రీతిశ్ నందికి 3,80,176 మంది పాలోవర్లున్నారు. వివాదాలను ట్వీటేస్తున్నారు! ఇండియన్ సెలబ్రిటీస్‌లో ఈ విషయం గురించి ముందుగా ప్రస్తావించుకోవాల్సింది దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేసి ఓపెనప్ అయిపోయే వర్మ సినీ, రాజకీయ, మహిళా విషయాలలో వివాదాస్పద ట్వీట్లను ఎన్నో ఇచ్చాడు. అవన్నీ పత్రికలకు వార్తలు అవుతూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత ఇచ్చిన రెండు మూడూ ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి. ‘వన్’ సినిమా వాల్ పోస్టర్‌కు సంబంధించి, పవన్‌కల్యాన్ మూడో పెళ్లికి సంబంధించి ట్వీట్లతో తనకు ఏ మాత్రం ఉపయోగంలేని వ్యవహారాల్లో వేలు పెట్టిందని అనిపించుకొంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ‘గే, లెస్బియన్’ ల గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించి అమితాబ్ కూడా అభాసుపాలయ్యాడు. తీర్పు పట్ల విషాదాన్ని వ్యక్తపరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వయసులో బిగ్ బి ఇలాంటి అంశాల గురించి ఎందుకు మాట్లాడాలి? అనే కామెంట్లు కూడా వినిపించాయప్పుడు. కొంతమందిది అడిక్షన్..! చేతిలో ఒక స్మార్ట్గాడ్జెట్ను ఉంచుకొని నిత్యం అప్డేట్స్ ఇవ్వడం మన సెలబ్రిటీలకు బాగా అలవాటుగా మారింది. టీవీ చానళ్లు బ్రేకింగ్ న్యూస్‌ను వేసినట్టుగా కొంతమంది సెలబ్రిటీలు అనునిత్యం ట్వీట్లను ఇస్తూనే ఉంటారు. షూటింగ్ స్పాట్స్‌లో ఖాళీ సమయం దొరికితే చాలు వీరు ట్వీట్లు ఇచ్చేస్తుంటారు. ఇక వారు ఏ విమానాశ్రయంలో ఫ్లైట్ కోసమో ఎదురుచూస్తున్నప్పుడు, దేశంలో ఏదైనా ప్రముఖ సంఘటన చోటు చేసుకొన్నప్పుడు ట్వీట్ల వర్షాన్నే కురిపించేస్తుంటారు. వాటికి వచ్చే రీట్వీట్లను ఆస్వాదించడానికే సెలబ్రిటీలు అంతగా ట్వీట్లను ఇస్తున్నారని అనుకోవాల్సి ఉంది. అయితే ఇది కూడా ఒకరకమైన అడిక్షన్ అని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. తాము ఏం పలికినా కొన్ని లక్షల మందికి చేరిపోతోందనే ఉద్వేగం వారి చేత అలా ట్వీట్లను ఇచ్చేలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. దీని ప్రకారం చాలా మంది సెలబ్రిటీలను ట్విటర్ అడిక్ట్స్ అనుకోవాల్సి వస్తోంది! - జీవన్ రెడ్డి.బి నేషనల్ లెవల్లో బిగ్ బీ... ది బాస్ భారతీయ సెలబ్రిటీల్లో అత్యధిక సంఖ్యలో ట్విటర్ ఫాలోవర్లను కలిగి ఉన్న వ్యక్తి బిగ్‌బి అమితాబ్ బచ్చన్. 77,00,796 మంది ఫాలోవర్లతో సెలబ్రిటీల్లో తొలిస్థానంలో ఉన్నారు. ఎక్కువగా హిందీలో, తక్కువగా ఇంగ్లిష్‌లో ట్వీట్లనిచ్చే అమితాబ్ తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ కవిత్వాన్ని పోస్టు చేస్తారు. షారూఖ్ ఖాన్‌కు 63,87,127 మంది బాలీవుడ్లో అమితాబ్ తర్వాత అంతటి స్థాయి అభిమానగణాన్ని సంపాదించి, బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపు ఉన్న షారూఖ్ ట్విటర్ ఫాలోవర్లవ విషయంలో కూడా అమితాబ్ తర్వాతి స్థానంలోనే ఉన్నారు! సల్మాన్ ఖాన్- 59,27,751 ట్విటర్లో షారూఖ్ స్థానాన్ని అందుకుని అమితాబ్ తర్వాతి స్థానం సంపాదిచుకోవడానికి పుష్కలంగా అవకాశం కలిగిన వ్యక్తి సల్మాన్. తన సినిమాలు వచ్చినప్పుడు, ‘బీయింగ్ హ్యూమన్’కార్యక్రమాలకు సంబంధించిన ట్వీట్లు మాత్రమే వెలువడుతూ ఉంటాయి. ఆమిర్ ఖాన్- 55,47,847 సంవత్సరాల తరబడి ఆమిర్ ట్విటర్ పేజ్‌లోకి లాగిన్ అవ్వకుండా గడిపేస్తున్నా పాలోవర్ల సంఖ్యమాత్రం నిత్యం పెరుగుతూనే ఉంది! ఆమిర్ కూడా కేవలం తన సినిమాల గురించి మాత్రమే స్పందిస్తూ ఉంటారు. ప్రియాంకా చోప్రా- 53,45,184 ఒకప్పుడు భారతీయ సెలబ్రిటీలందరిలోనూ ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రియాంక తొలిస్థానంలో ఉండేది! ఇప్పటికైతే కాస్తంత వెనుకబడింది. అయితే ఈ స్థాయిలో ఫాలోవర్లను కలిగి ఉన్న ఏకైక భారతీయ మహిళ ప్రియాంక! దీపిక పదుకొనే: 50,59.997 తన స్నేహితుల గురించి, సినిమాల గురించి, క్రికెట్ గురించి ట్వీట్లను ఇచ్చే దీపిక ఫాలోవర్ల సంఖ్య విషయంలో ఫాలోవర్లు ఫిదా అయిపోతున్నారు. ఫాలో కావడానికి పోటీ పడుతున్నారు. హృతిక్ రోషన్: 48,79,760 తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా హృతిక్ ట్విటర్లో పోస్టు చేస్తుంటాడు. అభిమానులకు బోలెడన్ని విశేషాలు చెబుతుంటాడు. అక్షయ్ కుమార్: 41,39,278 హృతిక్ తర్వాతిస్థానంలో అక్కీ ఉండగా...వీరి మధ్య ఫాలోవర్ల సంఖ్య విషయంలో వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని గమనించవచ్చు. ఇప్పటి వరకూ అక్షయ్ 1,677 ట్వీట్లను ఇచ్చారు. సచిన్ టెండూల్కర్: 40,18,271 ఒకప్పుడు ఫాలోవర్ల సంఖ్య విషయంలో తొలిస్థానం కోసం పోరాడిన టెండూల్కర్ ఆఖరిసారి ట్వీట్స్ ఇచ్చింది 2013 ఫిబ్రవరిలో! అందుకే ఫాలోవర్ల సంఖ్య విషయంలో మాస్టర్ వెనుకబడి పోయారు. ప్రీతి జింతా:26,26,722 సినిమాల విషయాలను, షూటింగుల కోసం విదేశీ టూర్లను విశదీకరిస్తుంటుంది ప్రీతి. క్రికెట్ఫ్యాన్ను అంటూ క్రికెట్ కబుర్లు చెబుతూ ఉంటుంది. తద్వారా టాప్‌టెన్‌లో స్థానం సంపాదించింది. మనోళ్లు ఎక్కడ? ఇండియాకు సంబంధించి ట్విటర్ గురించి మాట్లాడుకోవడం అంటే అది బాలీవుడ్ సబ్జెక్ట్ అయిపోతోంది! ఇది సోషల్నెట్వర్కింగ్ సైటే అయినా.. బాలీవుడ్ నెట్‌వర్క్‌ను మాత్రమే కవర్ చేస్తోంది. అందుకు కారణం దక్షిణాది సినిమా సెలబ్రిటీలు ట్విటర్ గురించి అంతగా పట్టించుకోకపోవడమే! బాలీవుడ్ స్టార్ హీరోలందరికీ ట్విటర్ ఖాతాలు ఉంటే... మనవాళ్లలో వీరిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు! తెలుగు హీరోల్లో... మహేశ్ ఫాలోవర్ల సంఖ్య 7,05,178. తన సినిమాల విడుదల సమయాల్లో మాత్రమే మహేశ్ ట్వీట్స్ ఇస్తాడు. అప్పుడప్పుడు ఫ్యామిలీ విషయాలు పంచుకొంటాడు. హీరోయిన్లలో శ్రుతి హాసన్! కొన్ని హిందీ సినిమాలు కూడా చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకొన్న శ్రుతి కి 8,62,157 మంది ఫాలోవర్లున్నారు. సెకెండ్ ప్లేస్ త్రిషది! త్రిష చెప్పే కబుర్లకు మంచి క్రేజ్ ఉంది. 7,41,908 మంది ఫాలోవర్లతో దక్షిణాది సెలబ్రిటీల్లో రెండో ప్లేస్‌లో ఉంది ఈ భామ. దర్శకుల్లో రాజమౌళి... ఈగ సినిమాతో జాతీయస్థాయిలోగుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళికి 5,40,459 ల మంది ఫాలోవర్లున్నారు. నాగ్ పోటీ ఇస్తున్నాడు.. యువహీరోలతో ధీటుగా పోరాడుతున్నాడు అక్కినేని నాగార్జున. తన సినిమాల విశేషాల గురించి మాట్లాడే అక్కినేని నాగార్జునకు 4,86,910 మంది ఫాలోవర్లున్నారు. సమంత దూసుకొస్తోంది.. కొన్ని వివాదాస్పద ట్వీట్లను ఇచ్చిన సమంతకు ట్విటర్లో ఫాలోవర్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం తనకు 4,11,504 మంది ఫాలోవర్లున్నారు. దక్షిణాది స్టార్లు... తమిళ యువ హీరో ధనుష్‌కు 6,41,852 మంది పాలోవర్లున్నారు. మలయాళీ సీనియర్ హీరో మమ్మూట్టీ కి 2,53,018 మంది ఫాలోవర్లున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరసగా హీరో రామ్ పోతినేనికి 2,23,804, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు 1,29,409 మంది ఫాలోవర్లున్నారు. నంబర్ వన్ కోసం పోరు...! ఇండియన్ సెలబ్రిటీల విషయంలో పాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడైతే నంబర్ వన్స్థానంలో అమితాబ్ బచ్చన్ ఇతర సెలబ్రిటీలెవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నారు కానీ...కొంత కాలం కిందటి వరకూ భారతీయ సెలబ్రిటీల మధ్య తొలిస్థానం కోసం తీవ్రమైన పోరు నడించింది. అమితాబ్, షారూఖ్, ప్రియాంకా చోప్రా, సల్మాన్ల మధ్య ఈ పోరాటం కొనసాగింది. ఒక దశలో ప్రియాంక నంబర్ వన్ స్థానంలో కొనసాగింది. వీరి ఫాలోవర్ల సంఖ్య స్థాయి 15- 20 లక్షల వధ్య కొనసాగుతున్న సమయంలో అమితాబ్, సచిన్, షారూక్‌లను దాటేసి ప్రియాంక తొలిస్థానంలో చాలా రోజుల పాటు కొనసాగింది. -
ఆర్ట్... ఫర్ హైదరాబాద్
‘ఫర్ హైదరాబాద్’ గేయంతో నాలుగు వందల యేళ్ల హైదరాబాద్ సంస్కృతిని చిత్రీకరించిన అధ్యయనకారుడు డాక్టర్ వి.వి.స్వామి. అంతర్జాతీయ వేదిక మీద డాక్టరేట్ అందుకున్న ఈ కళాకారుడి చిత్రాల్లో గ్రామీణ భారతం కనిపిస్తుంది. ఆ రంగులమాలిక ఇది... మీకు బొమ్మలు వేయాలన్న ఆసక్తి ఎలా మొదలైంది? మా తాతగారు రైతు. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన మా నాన్నగారికి ఎలాగో కళాభిరుచి కలిగింది. ఆయన డ్రాయింగ్ నేర్చుకోవడానికి పడిన తపన నాకు తెలుసు. నాకు ఊహ తెలిసిన తర్వాత మా నాన్న సైకిల్ మీద స్కూలుకెళ్లేవారు. అప్పటికి ఆయన వయసు ముప్పైకి పైనే. అలా టెన్త్ పూర్తిచేసి మద్రాసులో ఫైన్ ఆర్ట్స్ డిప్లమో కోర్సు చేశారు. డ్రాయింగ్ టీచర్ అయ్యారు. ఇంటి దగ్గర 15-20 మంది పిల్లలు నాన్న దగ్గర బొమ్మలేయడం నేర్చుకుంటూ ఉండేవాళ్లు. నాన్నగారి ప్రోత్సాహంతోనే ఆర్టిస్ట్ అయ్యారా? మేము ఎనిమిది మంది పిల్లలం. నాకే కాదు ఆయన ఎవరికీ చిత్రలేఖనం నేర్పించలేదు. ముగ్గురం మాత్రం ఆయన ప్రమేయం లేకుండానే బ్రష్ పట్టుకున్నాం. కానీ ఈ కళను కొనసాగించింది నేనొక్కడినే. నాన్నగారు ఎందుకు నేర్పించలేదు? దీని మీద ఆధారపడితే జీవనం కష్టమని ఆయనకు గట్టి నమ్మకం. మరి బొమ్మలు వేయడం ఎలా అలవాటైంది? సాయంత్రాలు నేను పుస్తకం పట్టుకుని కూర్చునేవాడినే కానీ ఒక చెవి అటు ఒగ్గి మా నాన్న చెప్పే డ్రాయింగ్ పాఠాలు వింటుండే వాడిని. ఇంట్లో అంతా నిద్రపోయిన తర్వాత లేచి బొమ్మలేసేవాడిని. అలా రాత్రి మూడు వరకు వేసిన రోజులున్నాయి. తొలిబొమ్మను 1962లో బయటపెట్టాను, 65లో గుంటూరులో ప్రదర్శన పెట్టాను. మీరు వేసే బొమ్మలకు ప్రధానంగా ఏ రంగును ఉపయోగిస్తారు? నేను ఒక రంగుకు పరిమితం కాలేదు, కానీ ప్రైమరీ కలర్స్‌ని మాత్రమే ఉపయోగిస్తాను. చిత్రంలో భావప్రకటన ప్రధానం, అది పెన్సిల్ డ్రాయింగా, అక్రిలిక్ పెయింటింగా... అనేది ముఖ్యం కాదు. అలాగే ప్రతి చిత్రకారుడూ తనకంటూ ఒక స్టైల్‌ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మంచిదే కానీ ఆ స్టైల్... మనం వేయాలనుకున్న చిత్రలేఖనంలో కాన్సెప్ట్‌కి పరిధులు విధించకూడదు. రంగుల వాడకాన్ని టాపిక్ నిర్ణయించాలి తప్ప మన శైలి కాదు. చిత్రాల ఇతివృత్తం ఎలా? నా చిత్రాలు ఎక్కువగా నేచర్ ఆధారంగా ఉంటాయి. ఒక సబ్జెక్టు అనుకున్న తర్వాత దాని మీద మూడు- నాలుగు నెలలు స్టడీ చేసేవాడిని. ఆ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో చర్చించి కానీ బొమ్మ వేయను. గణపతి బొమ్మల వేయడానికి ముందు చేసిన అధ్యయనం ద్వారా 64 మూర్తుల వివరాలు తెలిశాయి. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కో గణపతి వర్ణన ఉంటుంది. ఆ వర్ణన ఆధారంగా బొమ్మవేయాలి. పెయింటింగ్స్‌ని ఆదరించడంలో ఇండియాకీ విదేశాలకీ తేడా? నా పెయింటింగ్ ఎగ్జిబిషన్ల కోసం దాదాపుగా ఇండియా అంతా తిరిగాను. చిత్రకారులు బొమ్మవేయగలరే కానీ దానిని కొనమని ఎవరినీ అడగలేరు. మార్కెటింగ్‌కి మరొక నిపుణుల మీద ఆధారపడాల్సిందే. గ్యాలరీలు ఆ పని చేసి కమిషన్ తీసుకుంటాయి. అమెరికాలో గ్యాలరీలు 50శాతం, ఇండియాలో 30శాతం కమీషన్ తీసుకుంటున్నాయి. అలాంటి మార్కెట్ కూడా ఢిల్లీ, ముంబయి వంటి మహానగరాలకే పరిమితం. హైదరాబాద్‌లో కూడా పెద్దగా మార్కెట్ లేదు. మనదగ్గర పెయింటింగ్‌ని డెకరేటివ్ పీస్‌గా కొనేవాళ్లే ఎక్కువ. గత కొన్నేళ్లుగా ముంబయిలో పెయింటింగ్‌ని ఇన్వెస్ట్మెంట్గా కొనే ధోరణి ఎక్కువవుతోంది. ఆ బొమ్మ వేసిన ఆర్టిస్ట్ భవిష్యత్తులో ఎంఎఫ్ హుస్సేన్‌లాంటి పేరుప్రఖ్యాతులు సంపాదిస్తే... ఇప్పుడు వేలల్లో కొన్న చిత్రం ధర అప్పుడు లక్షలకు చేరుతుంది. చిత్రకళ మీద ఆరాధన ఉన్నా అంత ధర పెట్టలేని వారి పరిస్థితి? ఒరిజినల్ పెయింటింగ్‌ని ప్రింట్ వేసి అమ్మే సంస్కృతి విదేశాల్లో ఉంది. ఇండియాలో ప్రింట్ అమ్మడాన్ని అహ్మదాబాద్‌లో చూశాను. డాక్టరేట్ ఏ చిత్రానికి అందుకున్నారు? పెయింటింగ్‌కి కాదు, రచనకి వచ్చింది. 1990లో హైదరాబాద్ 400 ఏళ్ల వేడుకల సందర్భంగా ‘ఫర్ హైదరాబాద్’ అనే ఎనభై పేజీల ఇంగ్లిష్ పోయెమ్ రాశాను. దానికి మూడేళ్లు హోమ్‌వర్క్ చేశాను. నటరాజ రామకృష్ణ వంటి ప్రముఖులను కలిశాను, నోట్స్ కోసం సాలార్జంగ్ మ్యూజియం, సియాసత్ పేపర్ లైబ్రరీలో గంటలకు గంటలు గడిపాను. ‘హిస్టారికల్ అండ్ కల్చరల్ హైదరాబాద్’ అంశం మీద మూడు ప్రాజెక్టులు చేశాను. అందులో ఈ పుస్తకం ఒకటి, మిగిలినవి రెండూ చిత్రకళా ప్రదర్శనలు. 2001లో సిడ్నీలో నిర్వహించిన ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయెట్స్’ సమావేశంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. హైదరాబాద్ మీద వేసిన చిత్రాల గురించి చెబుతారా? అందులో రెండు భాగాలున్నాయి, ఒకటి పురాతన హైదరాబాద్. రాజరిక వ్యవస్థ, అప్పటి ప్రజల జీవనశైలికి ప్రతిబింబాలు. మరొకటి సమకాలీన హైదరాబాద్‌ను ప్రతిబింబించే చిత్రాలు. యువ చిత్రకారులకు ఏదైనా సూచన..! పెయింటింగ్ అనేది నిరంతర ప్రక్రియ. ఒక చిత్రంతోనే పేరు ప్రఖ్యాతులను కోరుకోకూడదు. ఒక పెయింటింగ్‌ని ఐదారు రోజుల్లో వేస్తాం. రెండు రోజుల తర్వాత పరికించి చూస్తే ఏదో లోపం ఉన్నట్లు, మరికొంత మెరుగులు దిద్దితే బావుణ్ననిపిస్తుంది. అలా సొంతంగా విమర్శనాత్మకంగా విశ్లేషించుకోవాలి. యువ చిత్రకారుల కంటే కూడా చిన్న పిల్లల తల్లిదండ్రులకు తెలియాల్సిన విషయం ఒకటుంది. ఏ లలిత కళ అయినా ఒంటబట్టాలంటే స్వతహాగా కొంత జ్ఞానం, దార్శనికత ఉండాలి. దానిలో మెళకువలను నేర్పించడం వరకే బోధకుల పాత్ర. నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేసినట్లు చిత్రకారులను తయారు చేయలేం. డ్రాయింగ్ క్లాసులకు పంపించిన రోజు నుంచి పిల్లలు గొప్ప చిత్రకారులైపోవాలని ఆత్రుత పడకూడదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి చిత్రకారుడి గురించి... పేరు: డాక్టర్ వి.వి. స్వామి(వల్లూరి వెంకటస్వామి) పుట్టింది: గుంటూరు జిల్లా వేమవరం. చదివింది: ఎం.ఎ పొలిటికల్ సైన్స్, జర్నలిజంలో పి.జి డిప్లమో, పబ్లిక్ రిలేషన్స్ అండ్ అడ్వర్టయిజింగ్‌లో డిప్లమో, పెయింటింగ్‌లో హయ్యర్ గ్రేడ్. ఇప్పటి వరకు వేసిన చిత్రాలు 2,500